Vizag Global Investors Summit 2023 Investments by Department - Sakshi
Sakshi News home page

Global Investors Summit 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. శాఖల వారీగా వివరాలు ఇలా..

Mar 4 2023 2:22 PM | Updated on Mar 4 2023 3:41 PM

Vizag Global Investors Summit 2023 Investments By Department - Sakshi

రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓలు జరిగాయి.

సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌-2023లో ఏపీకీ పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి.

శాఖలవారీగా పెట్టుబడుల వివరాలు ఇలా..

► ఎనర్జీ విభాగంలో రూ.9 లక్షల 7వేల 126 కోట్లు

► ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్లు

► ఐటీ అండ్ ఐటీఈఎస్ విభాగంలో రూ.39వేల 636 కోట్లు

► పర్యాటక విభాగంలో రూ.22వేల 96కోట్లు

► వ్యవసాయ విభాగంలో రూ.1,160 కోట్లు

► పశుసంవర్ధక విభాగంలో రూ.1,020 కోట్లు

జీఐఎస్‌ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. పారదర్శక పాలనతోనే విజయాలు సాధిస్తున్నామన్నారు.
చదవండి: విశాఖ జీఐఎస్‌ సూపర్‌ సక్సెస్‌.. ఇండస్ట్రీస్‌ మ్యాప్‌లో ఏపీ సుప్రీం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement