ప్రవీణ్‌ ఇప్పుడైనా పెళ్లి చేసుకో.. నేను గర్భిణిని | visakhapatnam girl case filed on lover | Sakshi
Sakshi News home page

ప్రవీణ్‌ ఇప్పుడైనా పెళ్లి చేసుకో.. నేను గర్భిణిని

Mar 29 2025 10:10 AM | Updated on Mar 29 2025 10:10 AM

visakhapatnam girl case filed on lover

విశాఖపట్నం: మూడేళ్లుగా ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు.. ఆ యువతి గర్భం దాల్చగానే ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి మల్కాపురం సీఐ విద్యాసాగర్‌ తెలిపిన వివరాలివి. ప్రవీణ్‌ అనే 24 ఏళ్ల యువకుడు 40వ వార్డు ఏకేసీ కాలనీలోని తన అక్క వద్ద మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్‌ ఉంటున్న ఇంటికి సమీపంలో 19 ఏళ్ల వయసు గల ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

ఆ యువతితో మొదట పరిచయం ఏర్పరచుకున్న ప్రవీణ్, అనంతరం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ యువకుడి మాటలను నమ్మిన యువతి అతడితో బయటకు వెళ్లడం, వారిద్దరూ శారీరకంగా కలవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో ఆ యువతి మూడు నెలల గర్భం దాల్చడంతో.. తనను ఇప్పుడైనా పెళ్లి చేసుకోవాలని ప్రవీణ్‌ను కోరింది. దీంతో అతడు నిరాకరించడంతో, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్‌ను పోలీసులు విచారించగా, అక్కడ కూడా పెళ్లికి నిరాకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement