అనకాపల్లి జిల్లా: సంప్రదాయాలను కొనసాగిస్తూ నూతన తరాలకు సమైక్యతల విలువలను నేర్పుతూ ఒకే కుటుంబానికి చెందిన 60 మంది సభ్యులు ఒకేచోటకి చేరారు. ఒకే ఆకులో సహపంక్తి భోజనం చేసి సమైక్యతకు ప్రత్యేకగా నిలిచింది బొడ్డేడ కుటుంబం. ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి గవరపాలేనికి చెందిన సుంకరమెట్ట సత్యనారాయణ స్వామి, సూర్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డేడ మురళి కుటుంబీకులు ఐక్యతకు ప్రతీకగా నిలిచారు.
ఏటా మాదిరిగానే సంక్రాంతి రోజు ఒకే ఆకుపై భోజనం చేసి సమైక్యతను చాటుకున్నారు. ఐదు దశాబ్దాలుగా కుటుంబ పెద్దల ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా కనుమ పండుగ రోజు గవరపాలెం చేరుకుంటారు. తమ పూర్వీకుల నివాసమైన అనకాపల్లిలో ఆనందంగా పండగ చేసుకుంటారు.


