
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. తమ సమస్యలపై కార్మికులు.. వైఎస్ జగన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ క్రమంలో వైఎస్ జగన్ వారితో మాట్లాడారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే స్టాండ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఒప్పుకోం. స్టీల్‌ప్లాంట్ కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. గతంలో అసెంబ్లీలో తీర్మానం చేశాం, ప్రధానికి లేఖలు రాశాం. స్టీల్‌ప్లాంట్‌పై పార్లమెంట్‌లోనూ ప్రశ్నిస్తాం అని భరోసా ఇచ్చారు. అనంతరం, వైఎస్ జగన్‌కు స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌కు రావాలని వైఎస్ జగన్‌ను ఆహ్వానించాం. స్టీల్ ప్లాంట్‌కు వచ్చి మద్దతిస్తానని హామీ ఇచ్చారు. మాకు మద్దతు ఇచ్చిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు.
మరోవైపు.. విశాఖలో వైఎస్ జగన్‌ను కలిసేందుకు బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు వచ్చారు. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు విశాఖకు తరలి వచ్చారు. ఈ క్రమంలో జి.భీమవరం వద్ద పోలీసులు.. మత్స్యకారులను అడ్డుకున్నారు. వైఎస్ జగన్‌ను కలిసేందుకు అనుమతి లేదన్నారు. దీంతో, ఎలాగైనా వైఎస్ జగన్‌ను కలిసి తీరుతామని మత్స్యకారులు తెలిపారు. అనంతరం, కూటమి నేతలను నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువునా మోసం చేశారని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలు తమకు వద్దని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.
