మందు.. సోడా.. మంచింగ్‌.. ఆ కోతే వేరబ్బా!

A Video Of Monkey Drinks Liquor Goes Viral - Sakshi

కోతి చేష్టలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా సందర్భాల్లో ఆకతాయి పనులు చేసే వారిని ఆ కోతి చేష్టలు ఏమిటా అని ప్రశ్నిస్తూ ఉంటాం.  ఏ తుంటరి పని చేసినా కోతితోనే పోలుస్తాం. చివరికి మందేసి.. చిందేసినా పెద్ద కోతి అంటూ విమర్శిస్తాం. మరి కోతే మందేస్తా.. అచ్చం మనషులు మందు తాగినట్లే తాగితే, మందుతో పాటు సోడా కూడా తాగాలని ఆ కోతి అనుకుంటే, అందులో మంచింగ్‌ ఉండాలని భావిస్తే ఏమనుకోవాలి.  

కాస్త విడ్డూరంగా అనిపించినా ఒక కోతి సోడా తాగి గ్లాస్‌లో ఉన్న మందు తాగి, ఆపై మంచింగ్‌ కూడా తీసుకుంటే ఏమనుకుంటాం..  ‘మందు.. సోడా.. మంచింగ్‌...ఆ కోతే వేరబ్బా’  అని అనుకోక తప్పదు. ఇలా ఒక కోతి మందేసిన ఘటన చిలకలూరిపేట మేఘన బార్‌ సమీపంలో చోటు చేసింది. అక్కడ షెడ్డుపై తాగేసి వదిలేసిన సోడాతో పాటు మందును తాగి తన దాహార్తిని కాస్త తగ్గించుకుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top