నది స్నానాలకు అనుమతి లేదు: వెల్లంపల్లి | Vellampalli Srinivas Comments On Tungabhadra Pushkaralu | Sakshi
Sakshi News home page

12 రోజుల పాటు తుంగభద్ర పుష్కరాలు

Nov 19 2020 7:06 PM | Updated on Nov 19 2020 9:19 PM

Vellampalli Srinivas Comments On Tungabhadra Pushkaralu - Sakshi

సాక్షి, కర్నూలు : తుంగభద్ర పుష్కరాలు రేపటి(నవంబర్‌ 20) నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. డిసెంబర్‌ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే ఘాట్‌లోకి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం కర్నూలుకు రానున్నారని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్నానాలను నిషేదించిట్లు మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నది స్నానాలకు అనుమతి లేదని మంత్రి గుర్తు చేశారు. పుష్కరాలను కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement