పూర్ణాహుతితో ముగిసిన శ్రీ మహారుద్ర సహిత
రాజశ్యామల సహస్ర చండీయాగం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాహిత పాలన కొనసాగాలని, ఆయనకు మరోసారి విజయం చేకూరాలని ఆకాంక్షిస్తూ.. 41 రోజులుగా 45 మంది వేద పండితులతో తాడేపల్లిలో నిర్వహిస్తున్న శ్రీ మహారుద్ర సహిత రాజశ్యామల సహస్ర చండీయాగం బుధవారం దిగ్విజయంగా ముగిసింది. ఈ సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్‌తో వేద పండితులు ప్రత్యేక పూజలు చేయించారు.
పూర్ణాహుతికి వినియోగించే ద్రవ్యాలకు సీఎం జగన్‌తో షోడశోపచార పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం అందజేశారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరామ ప్రసాద్ శర్మ, గౌరావర్జుల నాగేంద్రశర్మ ఆధ్వర్యంలో ఈ యాగం జరిగింది. పూర్ణాహుతి కార్యక్రమంలో చండీయాగ నిర్వాహకులు డాక్టర్ ఆరిమండ వరప్రసాద రెడ్డి, విజయశారదా రెడ్డి దంపతులు, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దంపతులు, రక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment