రెండు రోజుల్లో వర్షాలు | Two days of Rain In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో వర్షాలు

Jun 26 2021 5:16 AM | Updated on Jun 26 2021 5:16 AM

Two days of Rain In Andhra Pradesh - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జార్ఖండ్‌ నుంచి దక్షిణ కోస్తాంధ్రా వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి  బలహీనపడింది. ఇది దక్షిణ ఒడిశా వైపు 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఉత్తర భారతదేశం, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌ పరిసరాల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడడం వల్ల గాలుల వేగం రాష్ట్రంపై పెరిగింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28 తేదీల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడా.. ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశాలున్నాయి. కాగా, జూలై మొదటి వారంలోనూ కోస్తా, రాయలసీమల్లో వర్షాలకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.  

Advertisement
 
Advertisement
Advertisement