
అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను..
సాక్షి, తిరుపతి: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. అక్టోబర్ కోటా టికెట్లను విడుదల చేయనుంది.
అక్టోబర్ మాసానికి సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్లైన్ లక్కీడిప్ కోసం ఈనెల 20వ తేదీ వరకు అవకాశం కల్పించనుంది.
ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. పాతిక వేల మంది భక్తులు తలనీలాలు, 71 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది.
ఇదీ చదవండి: శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానం