తిరుమల: శ్రీవారి సర్వదర్శనం భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రోజూ ఆన్‌లైన్‌లో కరెంట్ బుకింగ్ కింద కేటాయిస్తున్న 500 శ్రీవాణి టికెట్లను 250కి కుదించారు. అదేవిధంగా గతంలో శ్రీవాణి టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న భక్తులకు ఇస్తున్న 300 టికెట్లను 250కి కుదించారు. దీంతో బుధవారం కరెంట్ బుకింగ్‌లో ఉదయం 9 గంటలకు 500 టికెట్లను మాత్రమే రెండు కేటగిరీలకు కలిపి జారీచేశారు. రద్దీ తగ్గేంత వరకు ఈ విధానాన్ని కొనసాగించనున్నట్లు సమాచారం.


