‘న్యాయవాదుల ఆకాంక్షలను ప్రభుత్వం విస్మరిస్తోంది’ | Kurnool YSRCP Legal Cell advocates meet YSRCP Chief YS Jagan | Sakshi
Sakshi News home page

‘న్యాయవాదుల ఆకాంక్షలను ప్రభుత్వం విస్మరిస్తోంది’

Sep 30 2026 7:41 PM | Updated on Sep 30 2026 7:54 PM

Kurnool YSRCP Legal Cell advocates meet YSRCP Chief YS Jagan

తాడేపల్లి : కూటమి ప్రభుత్వం న్యాయవాదుల ఆంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు ఆ పార్టీ కర్నూలు లీలగ్‌సెల్‌ న్యాయవాదులు.  ఈ మేరకు తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ను  లీగల్ సెల్ నేతలు మనోహర్ రెడ్డి, స్వాములు, సువర్ణరెడ్డి తదితరులు కలిశారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, కానీ ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. రాయలసీమ ప్రజలు, న్యాయవాదుల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. 

వైఎస్‌ జగన్‌ హయాంలో రాయలసీమ అభివృద్ధి, న్యాయవాదులకు కలిగిన ప్రయోజనాలను న్యాయవాదులు వివరించారు. కర్నూలు జ్యుడిషియల్‌ క్యాపిటల్‌ హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, ఏపీఈఆర్సీ తరలింపు, నేషనల్‌ లా యూనివర్సిటీ శంకుస్థాపలను ప్రస్తావించారు.అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌కు రూ.100 కోట్లు.. ‘లా నేస్తం’ ద్వారా జూనియర్‌ న్యాయవాదులకు రూ.49.51 కోట్ల సాయం అందించారని వెల్లడించారు.  కానీ ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవటం లేదంటూ ఫిర్యాదు చేశారు. 

ఇదీ చదవండి: వైఎస్‌ జగన్‌ను కలిసిన లంకపల్లి రైతులు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement