తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కర్నూలు పార్టీ లీగల్ సెల్ నేతలు బుధవారం కలిశారు. న్యాయవాదుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు.
కానీ, ఆ దిశగా చర్యలు తీఈసుకోవడం లేదని చెప్పారు. రాయలసీమ ప్రజలు, న్యాయవాదుల ఆకాంక్షలను టీడీపీ ప్రభుత్వం విస్మరిస్తోందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. వైఎస్ జగన్ హయాంలో రాయలసీమ అభివృద్ధిని, న్యాయవాదులకు కలిసిగిన ప్రయోజనాలను లాయర్లు వివరించారు.
కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్, హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, ఏపీఈఆర్‌సీ నేషనల్ లా వర్సిటీ శంకుస్థాపనలను న్యాయవాదులు ప్రస్తావించారు. అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు రూ.100 కోట్లు లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు రూ.49.51 కోట్ల సాయం అందించారని వెల్లడించారు. కూటమి సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో లీగల్ సెల్ నేతలు మనోహర్ రెడ్డి, స్వాములు, సువర్ణరెడ్డి, తదితరులు ఉన్నారు.


