ఇలాగైతే.. ఎలా గురూ! | 34 percent faculty positions in central higher education institutions are vacant | Sakshi
Sakshi News home page

ఇలాగైతే.. ఎలా గురూ!

Oct 1 2026 4:06 AM | Updated on Oct 1 2026 4:06 AM

34 percent faculty positions in central higher education institutions are vacant

కేంద్ర ఉన్నత విద్యాసంస్థల్లో 34 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీ 

దేశంలో 56.2 శాతం ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీయే 

భర్తీ కాని 38.3 శాతం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 18 శాతం ఖాళీ 

ఐఐటీల్లో 39 శాతం, ఐఐఎంల్లో 31 శాతం పోస్టులు ఖాళీ

అత్యధికంగా ట్రిపుల్‌ ఐటీల్లో 54 శాతం ఖాళీ

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడి    

సాక్షి, అమరావతి: కేంద్ర నిధులతో నడిచే విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో మంజూరైన అధ్యాపక పోస్టుల్లో మూడింట ఒక వంతు ఖాళీగా ఉన్నాయని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక కుండబద్దలు కొట్టింది. దీనివల్ల ఉన్నత చదువులపై ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. 2024తో ముగిసిన గత దశాబ్దంలో భారతదేశంలో ఉన్నత విద్య ఒక అద్భుతమైన పరివర్తనను సాధించిందని, అయి­తే ఉన్నత విద్యపై వ్యయం పెరగడం లేదని, స్తబ్దత నెలకొందని నివేదిక పేర్కొంది. ఉన్నత విద్యపై మొత్తం బడ్జెట్‌లో కేటాయింపులు ప్రస్తుతం 1% వద్దే ఉండిపోయాయని.. దీన్ని 1.5 శాతానికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. 

2017–18 మొత్తం బడ్జెట్‌ వ్యయంలో ఉన్నత విద్య వ్యయం 1.6 శాతంగా ఉందని, ఇప్పుడు 1 శాతం వద్దే స్థిరంగా ఉందని నివేదిక తెలిపింది. దీంతోపాటు ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని నివేదిక సూచించింది. దేశంలోని కేంద్ర విద్యాసంస్థల్లో 34 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ట్రిపుల్‌ ఐటీల్లో ఏకంగా 54 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో 56.2 శాతం ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 38.3 శాతం, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు 18 శాతం ఖాళీగా ఉన్నాయని నివేదిక వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement