సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. మీన లగ్నంలో శ్రీవారి ధ్వజారోహణ ఘట్టాన్ని అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభించారు. బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలను ఆరంభించారు వేదగానాలు.. మంగళవాయిద్యాల నడుమ ఘనంగా ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.
సకల దేవతలు.. అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం బంగారు తిరుచ్చిపై స్వామి, పరివార దేవతలతో నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగింపు కొనసాగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు దర్శనమివ్వనున్నారు. ఈ రోజు రాత్రికి 8 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమివ్వనున్నారు. నేటి(సెప్టెంబర్ 15) నుంచి 23 వరకూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.


