breaking news
sri vari brahmotsavas
-
పండగ వేళ : ఆరవరోజు లక్ష్మీదేవిగా అవతారం
-
రేణిగుంట నుంచి గంగమ్మ ఆలయానికి సీఎం వైఎస్ జగన్
-
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: టీటీడీ చైర్మన్
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 7 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా టీటీడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగుతాయని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు బుధవారం తెలిపారు. నేడు అంకురార్పణ చేయగా, రేపు ధ్వజారోహణం కార్యక్రమం జరుగుతుందన్నారు. శ్రీ వారి వాహన సేవలు ఉదయం 9 నుంచి 10 గంటలు, రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా ఏకాంతంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో స్వర్ణ రథం, తేరు కూడా ఉండవని అన్నారు. సర్వభూపాల వాహన నిర్వహణ ఉంటుందని చెప్పారు. బ్రహ్మోత్సవాలలో ఆగమోత్తంగా కైంకర్యాలు నిర్వహించనున్నారు. భక్తులు వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ నుంచి లైవ్, ఇతర చానల్ లింక్స్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. చక్రస్నాన మహోత్సవం కూడా ఆలయంలోని అయిన మహల్లో నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ వాహనం రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ అలిపిరి వద్ద నూతనంగా నిర్మించిన గోమందిరాన్ని ప్రారంభింస్తారు. పాత బర్డ్ హాస్పిటల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. వీటితో పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ కన్నడ, హిందీ భాషలలో ప్రారంభించనున్నారు. తిరుమలలో స్వామివారి ప్రసాదాల తయారీకి నూతనంగా నిర్మించిన బూందీ పోటు నిర్మాణాన్ని కూడా సీఎం ప్రారంభించనున్నారు. చదవండి: Seshachalam Hills: ట్రెక్కింగ్‌కు పెరుగుతున్న ఆదరణ . -
25 నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
తిరుమల: శ్రీవారి ఆలయంలో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహరణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించటం సంప్రదాయం. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు నిర్వహించేవారు. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఈ ఉత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ క్రమం తప్పకుండా ప్రతి ఏటా శ్రావణ మాసంలో మూడు రోజులపాటు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది. తొలి రోజు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో మలయప్పస్వామి పవిత్రోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. తులసి పూసలలాగా ఉన్న పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ప్రతిష్టించి ఏడు గుండాల్లో హోమాలు, ఉత్సవమూర్తులకు అభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. రెండో రోజు పవిత్రాల సమర్పణ, మూడో రోజు పూర్ణాహుతితో కార్యక్రమం ముగింపు పలుకుతారు. ఆ మూడు రోజులు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.