మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం.. దూరం పెట్టడంతో! | Sakshi
Sakshi News home page

మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం.. కుమార్తె ఎదుగుతోందని దూరం పెట్టడంతో!

Published Tue, Sep 26 2023 11:46 AM

Ten Years Girl Murder In East Godavari - Sakshi

తూర్పు గోదావరి: తనను తీసుకువెళ్తున్నది మేకవన్నె పులి అని.. అభం శుభం తెలియని ఆ చిన్నారి మనస్సుకు అర్థం కాలేదు.. నిలువెల్లా కాపట్యం నిండిన ఆ క్రూరుడు తనను కబళించేస్తాడని ఏ మాత్రం అనుకోలేదు.. బంధువే కదా అనుకుంటూ ఆ దుర్మార్గుడిని నమ్మింది.. మాయమాటలు విని, అతడితో వెళ్లింది.. చివరకు ఆ దౌర్భాగ్యుడి చేతుల్లో అత్యంత క్రూరంగా హతమారిపోయింది. పెద్దాపురం పట్టణంలో సంచలనం రేపిన బాలిక హత్యకు కారకుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం..
 
పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన దంపతులు ద్రోణ వీర్రాజు, జ్యోతి కొన్నాళ్ల కిందట మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో జ్యోతి తన పదేళ్ల కుమార్తె ప్రవీణ కుమారి అలియాస్‌ మానస, తన తల్లి సునీతతో కలసి పట్టణ శివారులోని ఎన్‌టీఆర్‌ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన బత్తిన నాని జ్యోతికి సమీప బంధువు. వరుసకు మేనల్లుడు అవుతాడు. ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి, కొనసాగుతోంది. అయితే, తన కుమార్తె ఎదుగుతోందని, ఇంటికి రావడం సరికాదని అంటూ కొన్నాళ్లుగా నానిని జ్యోతి దూరం పెడుతోంది. అది తట్టుకోలేని నాని తమ సాన్నిహిత్యానికి అడ్డంగా ఉన్న మానసను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. 

దీనికి ప్రణాళిక సిద్ధం చేశాడు. అందులో భాగంగా బయటకు తీసుకువెళ్తానని ఈ నెల 19వ తేదీన మానసకు చెప్పాడు. బంధువే కావడంతో అతడి మాటల్ని ఆ బాలిక నమ్మింది. మానసను తన బైక్‌పై ఎక్కించుకున్న నాని, స్థానిక కట్టమూరు పుంత రోడ్డులోకి తీసుకువెళ్లి, ముందే వేసుకున్న పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు చెబుతున్నారు.బయటకు వెళ్లిన మానస ఎంతకూ ఇంటికి రాకపోవడంతో జ్యోతి ఈ నెల 20వ తేదీన పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న నానిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టేందుకు ప్రయతి్నంచారు. 

చివరకు అతడు పరారీలో ఉన్నాడని గుర్తించారు. మరోవైపు బాలిక ఆచూకీ కోసం కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కట్టమూరు పుంతలో బాలిక మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆ బాలిక మృతదేహం పూర్తిగా పాడైపోయింది. కుక్కలు ఈడ్చుకు రావడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. చివరకు దుస్తుల ఆధారంగా ఆ మృతదేహం మానసదేనని గుర్తించారు. 

చిన్నారి మృతదేహానికి పెద్దాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మానస హత్యకు కారకుడైన నాని ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతడిని పట్టించిన వారికి రూ.10 వేల పారితోíÙకం అందిస్తామని ప్రకటించారు. డీఎస్పీ లతాకుమారి నేతృత్వంలో సీఐ అబ్దుల్‌ నబీ, ఎస్సై సురే‹Ùలు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement