ఆంధ్రప్రదేశ్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేస్తాం | Telangana government to file a counter on Margadarshi petition | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేస్తాం

Dec 3 2022 3:49 AM | Updated on Dec 3 2022 3:54 PM

Telangana government to file a counter on Margadarshi petition - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటరు దాఖలు చేస్తామని మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావు సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు రెండు వారాలు గడువు ఇవ్వాలని, విచారణ వాయిదా వేయాలని కోరారు.

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ అంశంలో ఉండవల్లి అరుణ్‌కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లు శుక్రవారం జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జేకే మహేశ్వరిల ధర్మాసనం ముందుకొచ్చాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌లో కౌంటరు దాఖలుకు సమయం కావాలని, విచారణ వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కూడా ధర్మాసనాన్ని కోరింది. ఈ మేరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement