జేసీకి వినతిపత్రం అందజేస్తున్న బండారు
గ్రీవెన్స్‌లో విశాఖ జేసీకి వినతిపత్రం అందించిన
మాడుగుల ఎమ్మెల్యే బండారు
పెందుర్తిలోని 8.08 ఎకరాల పెద్దన్న చెరువును టీడీపీ నేతలు ప్లాట్లుగా మార్చేస్తున్నారని పరోక్షంగా ఆరోపణలు
మహారాణిపేట (విశాఖపట్నం): పెందుర్తి మండలం, పెందుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నం.107/11లో ఉన్న పెద్దన్న చెరువు ప్రభుత్వ భూమి 8.08 ఎకరాలుని ఆక్రమణదారుల నుంచి పరిరక్షించాలని మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి కోరారు. ఈ మేరకు విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. గతంలో ఈ భూమి ఆక్రమణకు జరిగిన ప్రయత్నాలు, అధికారులు చేపట్టిన చర్యలను వివరించారు.
అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ... సర్వే నం.107/11లో ఉన్న 8.08 ఎకరాల పెద్దన్న చెరువు భూమిని పెందుర్తి నియోజకవర్గం టీడీపీ నాయకులే ఆక్రమించారని పరోక్షంగా ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, అతని అనుచరులపై ఆరోపణ చేశారు. వారు ఈ భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయించేందుకు ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు.
బినామీలను సృష్టించి రూ.100 కోట్ల భూమి కబ్జా
లేని రైతులను సృష్టించి బినామీ పేర్లతో రిజి్రస్టేషన్ చేశారని బండారు ఆరోపించారు. గతంలో పెద్దన్న చెరువు అన్యాక్రాంతంపై తాను ఫిర్యాదు చేశానని, అప్పటి కలెక్టర్ శ్యామలరావు విచారణ జరిపి రిజి్రస్టేషన్‌ను రద్దు చేసి భూమిని ప్రభుత్వ ఆ«దీనంలోకి తీసుకున్నారని గుర్తు చేశారు. మళ్లీ గత రెండు నెలలు నుంచి ఆక్రమణదారులు మరలా చెరువులో పనులు మొదలుపెట్టారని, అధికార టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి చెరువుని కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వామపక్షాల నాయకులు కూడా ఇటీవల చెరువును పరిశీలించి అధికార పార్టీ నాయకులు చెరువును కబ్జా చేస్తున్నారని ఆరోపించారని గుర్తు చేశారు. బినామీ రైతులను సృష్టించి రూ.100 కోట్లు విలువైన భూమిని కొట్టేయాలని చూస్తున్నారని, పరిరక్షించాలని అధికారులను కోరినట్టు బండారు తెలిపారు.


