breaking news
encroachment
-
బంధువుకు భూ పందేరం.. గీతం కబ్జాలకు గిఫ్ట్!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాజు తలుచుకుంటే అడ్డేముంది? చంద్రబాబు బరితెగిస్తే తిరుగేముంది? దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ సాహసించని విధంగా భూ దోపిడీతో తన సొంత కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఇస్తున్న అత్యంత ఖరీదైన గిఫ్ట్ ఖరీదు ఏకంగా రూ.5,000 కోట్లు!! విశాఖలో అత్యంత విలువైన రుషికొండ ప్రాంతంలో తన బంధుగణం కబ్జా చేసి ఆక్రమించిన విలువైన ప్రభుత్వ భూమిని దోచిపెట్టేందుకు చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తన బావమరిది అయిన బాలకృష్ణ చిన్న అల్లుడు, తన తనయుడు నారా లోకేశ్ తోడల్లుడు, విశాఖ ఎంపీ శ్రీభరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ కబ్జాలకు పాల్పడి ఆక్రమించుకున్న 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కానుకగా కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. విశాఖ నడిబొడ్డున ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి కట్టబెట్టేందుకు జీవీఎంసీ వేదికగా కుట్రలకు తెర తీశారు. ఈ భూ సంతర్పణకు జీవీఎంసీ చివరి పాలక వర్గ సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసేందుకు అజెండాలో 15వ అంశంగా చేర్చారు. ఎకరం రూ.100 కోట్లు చొప్పున రూ.5 వేల కోట్లకు పైగా విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములను గీతం సంస్థలకు ధారాదత్తం చేయాలని నిర్ణయించారు. నాడు గీతం యాజమాన్యం ఆక్రమణల చెర నుంచి విడిపించి విలువైన ప్రభుత్వ భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపాడితే.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వాటిని నజరానాగా తమ బంధువులకు అప్పగించేందుకు సన్నద్ధమైంది. రూ.వేల కోట్ల ఆస్తులకు వారసుడైన ఎంపీ శ్రీభరత్.. ప్రభుత్వ భూములను అప్పనంగా కొట్టేసి తన భూ దాహాన్ని తీర్చుకోవడానికే విశాఖ ఎంపీ అవతారమెత్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.చివరి సమావేశంలో కుట్రలకు పదును!బలం లేకపోయినా.. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని బలవంతంగా లాక్కొన్న టీడీపీ కౌన్సిల్‌కు ఇదే చివరి సమావేశం కావడం గమనార్హం. ఇదే అదునుగా ప్రభుత్వ పెద్దలు తమ కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చేలా అధికార యంత్రాంగంపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలుస్తోంది. సీఎంవో, లోకేశ్ పేషీ నుంచి జీవీఎంసీపై తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను గీతం వర్సిటీకి ధారాదత్తం చేయాలనే కుట్రలకు పదును పెట్టారు. రూ.5,000 కోట్లకు పైగా విలువైన భూముల్ని చివరి సమావేశంలో నారా లోకేశ్ తోడల్లుడు ఎంపీ శ్రీభరత్‌కు కానుకగా ఇవ్వాలని కౌన్సిల్ భావిస్తోంది. ఆక్రమిత భూములేనని తేల్చిన ‘సిట్..’1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి తమ సన్నిహితుల భూ ఆక్రమణలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ‘గీతం’ ఆక్రమణల పర్వం మొదలైంది. ఒక్కో గజం తమ చెరలోకి తీసుకుంటూ ప్రభుత్వ భూములకు అక్రమాల కంచె వేసింది. 2014–19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా గీతం ఆక్రమణ చెరలో ఉన్న భూములను సదరు వర్సిటీకి ఎలినేషన్ కింద బదలాయించేందుకు సన్నాహాలు చేసినా పాచిక పారలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ.. విశాఖలో భూ కుంభకోణాలపై కొరడా ఝుళిపించింది. కబ్జారాయుళ్ల చెరలో ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమి ఉండటానికి వీల్లేదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ క్రమంలో.. గీతం భూ ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు నివేదిక సిద్ధం చేశారు. గీతం ఆక్రమించుకున్న భూమిలో 40.51 ఎకరాలకుపైగా దశలవారీగా స్వాధీనం చేసుకున్నారు. గీతం వర్సిటీ అడ్డగోలుగా ప్రభుత్వ భూములను ఆక్రమించేసి అందులో నిర్మించిన రక్షణగోడ, గార్డెన్, గ్రావెల్ బండ్లను తొలగించారు. గీతం యాజమాన్యం కోర్టుని ఆశ్రయించగా స్టేటస్ కో ఇచ్చింది. మిగిలిన 14 ఎకరాలకు పైగా భూమికి సంబంధించి కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన గీతం యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ 2016లోనే స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. గీతం చెరలో ఉన్న భూములు ఆక్రమించినవేనని నాడు చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ‘సిట్’ కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు అవే భూములను గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బాబు సర్కారు సన్నద్ధమైంది.నిబంధనలకు విరుద్ధంగా ఎలా కేటాయిస్తారు?గీతం యాజమాన్యం భూ కబ్జాలపై అప్పటి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో మాట్లాడుతూ అది భూముల ఆక్రమణే అని స్పష్టం చేశారు. తాను ‘చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్’ (సీసీఎల్ఏ) బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులను అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఎన్.కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో గీతం యాజమాన్యం సుమారు 34 ఎకరాల ప్రభుత్వ భూమిని కోరిందని, దీనిపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధమని తాను తిరస్కరించినట్లు పేర్కొన్నారు. గీతం కోరిన ఆ భూమిని ప్రైవేట్ సంస్థకు కాకుండా.. కేంద్ర ప్రభుత్వ విభాగాలైన ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్, సామాజిక సంక్షేమ శాఖలకు కేటాయిస్తూ 2014 ఫిబ్రవరి 26న సీసీఎల్ఏ నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చామని తెలిపారు. అయితే తాను పదవీ విరమణ చేసిన తర్వాత నాటి ప్రభుత్వం (టీడీపీ సర్కారు) నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని వెల్లడించారు. 2014లో ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తూ 2017 మే 15న జీవో నం.165 విడుదల చేశారని చెప్పారు. అప్పటికే ఆ ప్రభుత్వ భూములను గీతం విద్యాసంస్థలు ఆక్రమించుకున్నాయన్న ఆరోపణలు వాస్తవమేనంటూ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనప్పుడు దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను (కంచె వేయడం, ఆక్రమణల తొలగింపు లాంటివి) ఐవైఆర్ సమర్థించారు. ‘ఎవరు కబ్జా చేసినా ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడం సరైన చర్యే’ అని స్పష్టం చేశారు. ఊరు పేరు లేని ఉర్సా కోసం..విశాఖలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం ఊరు పేరు లేని ‘ఉర్సా’ లాంటి సంస్థలకు బరి తెగించి అప్పనంగా కట్టబెడుతోంది. ఎకరం కేవలం 99 పైసలకే లీజుకు ఇచ్చేస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీ గండి కొడుతోంది. ఈ విషయం బహిర్గతం కావడంతో జీవోల జారీ అంశాన్ని పెండింగ్‌లో పెట్టింది. సర్కారు భూములపై ‘గీతం’ లోన్లు.!ఒకవైపు గీతం ఆక్రమించిన భూములకు అధికారిక ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పటికే గీతం వర్సిటీకి కేటాయించిన ప్రభుత్వ భూములపై లోన్లు తీసుకునేందుకు గతేడాది అనుమతులు మంజూరు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గీతం కోసం అడ్డగోలు నిర్ణయాన్ని తీసుకుంది. గీతం కోసం గతంలో ఎండాడలోని సర్వే నం. 17/1, 17/28లోని 71.15 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ భూములు 22 ఏ జాబితాలో ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానివీుద బ్యాంకులో లోన్లు తీసుకునేందుకు అడ్డగోలుగా అనుమతించింది. 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములను మార్ట్గేజ్ చేసి.. బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకునే విధంగా అనుమతులు జారీ చేశారు. ఇప్పుడు ఆక్రమిత భూములను సైతం కట్టబెడుతున్నారు.బడ్డీ కొట్లు తొలగిస్తూ... బడాబాబుకు భూములా?పొట్ట కూటి కోసం వలస వచ్చి ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలను పోలీస్ బలగాలు, పొక్లెయిన్లతో ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా నిర్వాసితులను చేస్తోంది. వీధి వ్యాపారులను కూడా అదే విధంగా తొలగిస్తోంది. మరోవైపు రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న బడాబాబుకి మాత్రం దానం చేస్తోంది. రాష్ట్రంలో పెద్దలకు ఒక న్యాయం, నిస్సహాయులకు ఇంకొక న్యాయం! ప్రభుత్వ పెద్దలు తమ బంధువుకి చెందిన గీతం వర్సిటీ ఆక్రమించిన రూ.వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ పేరుతో దానం చేయాలని యత్నించడం అత్యంత దారుణం. ఏ నియమం కింద క్రమబద్ధీకరణకు అనుమతి ఇస్తారు? బీఎస్‌వో–24, రెవిన్యూ శాఖ 2012లో జారీ చేసిన జీవో నం.571 ప్రకారం ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరించి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటోందో రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమిందారీ సంస్థలు కావు. ప్రజాస్వామ్య విధానాలకు, చట్టాలకు లోబడి పని చేయాలి. గీతం వ్యవహారంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా. – ఈఏఎస్ శర్మ, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి -
ఎమ్మెల్యే అండ.. వాగు కబ్జా
పచ్చ ముఠాల భూ దాహానికి ఓ వాగు పూర్తిగా మాయం కాగా సుమారు రూ.120 కోట్ల విలువ చేసే స్థలం ఆక్రమణల పాలైంది. కబ్జా చేసిన స్థలాన్ని సాగు భూములుగా మార్చేసి పంటలు సాగు చేసుకుంటున్నారు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో మోంథా తుపాను సమయంలో దురాక్రమణ ఫలితం తెలిసివచ్చింది. వాగు ఆక్రమణతో పలు గ్రామాలు, వేలాది ఎకరాల పంట పొలాలు ముంపు బారిన చిక్కుకుని అపారనష్టం వాటిల్లింది. జాతీయ రహదారికి గండ్లు కొట్టించి తాత్కాలికంగా ముంపు ముప్పును తప్పించిన కలెక్టర్ ఆ తర్వాత మళ్లీ ఆక్రమణల జోలికెళ్లలేదు. కబ్జాదారులంతా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనుచరులు కావడంతోనే ఉన్నతాధికారులు వెనుకడుగు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఉప్పుటూరు – పోతుకట్ల వాగు కబ్జా వ్యవహారం ఇది.సాక్షి ప్రతినిధి, బాపట్ల: ఇసుక నుంచి గనుల దాకా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న పచ్చముఠాలు వాగులు వంకలను సైతం వదలడం లేదు! బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంతంలో ఏకంగా ఉప్పుటూరు – పోతుకట్ల వాగును కబ్జా చేశారు. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అండదండలతో ఉప్పుటూరు గ్రామ సర్వేనంబర్ 13 నుంచి ఉప్పుటూరు వరకు 300 అడుగుల వెడల్పు ఉండే వాగును 2 కి.మీ. పొడవున పూడ్చి చదును చేశారు. వాగు పరిధిలో సర్వే నంబర్లు 8, 12, 13, 13–1, 13 – 4, 13–6, 21–3, 30–1లలో 41 ఎకరాలతోపాటు సమీపంలోనే ఉన్న మరో 20 ఎకరాలు కలిపి సుమారు 61 ఎకరాల వాగు ప్రాంతాన్ని సాగు భూమిగా మార్చి వరి, మొక్కజొన్న తదితర పంటలు పండిస్తున్నారు. వాడరేవు– పిడుగురాళ్ల జాతీయ రహదారి ఈ వాగుమీదుగా వెళ్లడంతో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో రూ.10 లక్షలు ఉన్న ఎకరం ఇప్పుడు రూ.2 కోట్లు పలుకుతోంది. 60 ఎకరాలకు పైగా ఉన్న ఆక్రమిత భూముల విలువ సుమారు రూ.120 కోట్లు పైమాటే. వాగును పరిరక్షించాల్సిన డ్రైనేజీ, రెవెన్యూ అధికారులు పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని చారిత్రక వాగును పచ్చనేతలకు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. కబ్జాదారులంతా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనుచరులు కావడంతో ఉన్నతాధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు.మోంథా ముంచేయడంతో..గత ఏడాది వచ్చిన మోంథా తుపాను ఉప్పుటూరు వాగు కబ్జా వ్యవహారాన్ని బయటపెట్టింది. వాగు కబ్జాకు గురికావడంతో వరదనీరు పర్చూరు, నాగులపాలెం గ్రామాలను చుట్టుముట్టింది. అప్రమత్తమైన కలెక్టర్ వినోద్ కుమార్ పర్చూరు ప్రాంతం మ్యాపును పరిశీలించగా వాగు భౌతికంగా కనిపించలేదు. దీంతో మ్యాపులో చూపించిన ప్రకారం రెండు చోట్ల జాతీయ రహదారికి పెద్ద గండ్లు కొట్టించడంతో గ్రామాలకు వరద ముప్పు తప్పింది. అయితే ఉప్పుటూరు, వీరన్నపాలెం, పోతుకట్లతోపాటు కారంచేడు, చీరాల, వేటపాలెం, చినగంజాం మండలాల పరిధిలో 50 వేల ఎకరాల మేర వరి పంట నీట మునిగిపోయింది. పది రోజులపాటు నీటిలోనే ఉన్న వరి కుళ్లిపోవడంతో రైతులు రూ.వందల కోట్ల మేర నష్టపోయారు. ఈ ఉపద్రవానికి ఉప్పుటూరు – పోతుకట్ల వాగు కబ్జానే కారణమని గుర్తించినప్పటికీ ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.భూసేకరణలోనూ దాచిపెట్టి.. ఉప్పుటూరు వాగును అధికార పార్టీ నేతలకు అప్పగించిన అధికారులు దానిని కప్పిపుచ్చుకునేందుకు మరో తప్పిదం చేశారు. వాడరేవు – పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణ సమయంలో పర్చూరు ప్రాంతంలో ఉప్పుటూరు – పోతుకట్ల వాగు ఉన్న విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా చేశారు. భూసేకరణలోనూ దీన్ని దాచి పెట్టారు. దీంతో వాగు ఉన్న ప్రాంతంలో బ్రిడ్జిలు, కల్వర్టులు లేకుండానే రహదారిని నిరి్మంచారు. ఫలితంగా వరద ప్రవాహం గ్రామాలతోపాటు వేల ఎకరాల్లో పంట పొలాలను ముంచెత్తింది.ఏలూరి ఒత్తిడితో కలెక్టర్ వెనుకడుగు? శతాబ్దాలుగా సహజసిద్ధంగా ప్రవహిస్తున్న ఉప్పుటూరు – పోతుకట్ల వాగు కబ్జాకు గురైన ప్రాంతాన్ని కలెక్టర్ గుర్తించినప్పటికీ కబ్జాదారులపై చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. తుపాను సమయంలో పర్చూరు వద్ద జాతీయ రహదారికి గండి కొట్టిన ప్రాంతంలో వాగుపై బ్రిడ్జి నిర్మించాలని కలెక్టర్ ఆదేశించగా, సదరు నిర్మాణ సంస్థ చిన్నపాటి కల్వర్టులు నిర్మించి చేతులు దులిపేసుకుంది. దీంతో వరదనీరు బయటకు వెళ్లే పరిస్థితి లేదు. భవిష్యత్‌లోనూ ముంపు ముప్పు పొంచి ఉంది. జాతీయ రహదారి ప్రాంతంలో ఆక్రమణల్ని తొలగించి వాగును పునరుద్ధరించేందుకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారని భావించినా ఆయన మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఒత్తిళ్లతోనే కలెక్టర్ వెనక్కి తగ్గినట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. రహదారి నిర్మాణ సమయంలో కబ్జాదారులు అడ్డు తగలడంతో జాతీయ రహదారుల సంస్థ బ్రిడ్జిలను నిరి్మంచలేదని డ్రైనేజీ విభాగం డివిజినల్ అధికారి మల్లిఖార్జునరావు చెబుతుండగా.. పర్చూరు తహసీల్దారు బ్రహ్మయ్యను ఆక్రమణల విషయమై స్పందన కోరేందుకు ప్రయతి్నంచినా అందుబాటులోకి రాలేదు. -
ఢిల్లీలో ఉద్రిక్తత.. జనం రాళ్ల దాడి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని పాతబస్తీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తుర్క్‌మన్ గేట్ సమీపంలోని పురాతన మసీదు ఆనుకుని ఉన్న అక్రమ ఆక్రమణలను మున్సిపల్ అధికారులు, భద్రతా బలగాలు భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. వాస్తవానికి ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ కూల్చివేత ప్రక్రియను అధికారులు వ్యూహాత్మకంగా అర్ధరాత్రి 1:30 గంటలకే మొదలుపెట్టారు. బుల్డోజర్లు, ఎర్త్ మూవర్లతో ఆక్రమణలను తొలగిస్తుండగా, పోలీసులు గట్టి కాపలాగా నిలిచారు. ఈ ఆకస్మిక చర్యతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కూల్చివేతలను అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించడంతో ఆ ప్రాంతం రణరంగంగా మారింది. నిరసనకారులు భద్రతా దళాలపైకి రాళ్లు రువ్వగా, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు (టీయర్ గ్యాస్) ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు మాత్రమే టియర్ గ్యాస్ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. తుర్క్‌మన్ గేట్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. #WATCH | Delhi | Visuals from the area near Faiz-e-Elahi Masjid, Turkman Gate, where MCD, pursuant to the directions of the Delhi High Court, carried out a demolition drive on an encroachment earlier today. Madhur Verma, Joint Commissioner of Police, Central Range, says,… pic.twitter.com/56LD5zeYZg— ANI (@ANI) January 7, 2026ఈ కూల్చివేతలపై ఢిల్లీ సెంట్రల్ రేంజ్ జాయింట్ సీపీ మధుర్ వర్మ స్పందిస్తూ.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఈ చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. ఫైజ్-ఎ-ఇలాహీ మసీదు సమీపంలోని ఆక్రమణలను తొలగించే క్రమంలో ఈ ప్రాంతాన్ని తొమ్మిది జోన్లుగా విభజించి, అదనపు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దాదాపు 10 కంపెనీల ఢిల్లీ పోలీస్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను ఇక్కడ మోహరించారు. కూల్చివేతకు ముందు అమన్ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాలు నిర్వహించినప్పటికీ, కొందరు దుండగులు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.మసీదు సయ్యద్ ఇలాహి నిర్వాహక కమిటీ ఈ కూల్చివేతలను సవాలు చేస్తూ, హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, గతంలోనే కోర్టు ఇచ్చిన గడువు ప్రకారం అధికారులు ఈ తొలగింపు చేపట్టారు. గత అక్టోబర్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం, 38,940 చదరపు అడుగుల మేర రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఆక్రమణలు జరిగినట్లు గుర్తించారు. మసీదు ఉన్న 0.195 ఎకరాల భూమి మినహా మిగిలిన అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఎంసీడీ నోటీసులు జారీ చేసింది. గతంలో ఎర్రకోట పేలుడు నిందితుడు ఉమర్-ఈ ప్రాంతాన్ని సందర్శించినట్లు అధికారులు పేర్కొనడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘నా నోబెల్ ట్రంప్‌కే..’ మచాడో సంచలనం -
రూ.5 కోట్ల ప్రభుత్వ భూమి హాంఫట్
దొరవారిసత్రం: తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని నెలబల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక అధికార టీడీపీ నేతలు చెరబట్టారు. ఎకరం రూ.50 లక్షలు విలువచేసే సుమారు పదెకరాల భూముని చదునుచేసి సాగుకు అనువుగా మార్చుకున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలివీ..నెలబల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 7లో 71 ఎకరాల భూమిలో బీసీ, ఎస్సీ కాలనీలు, వివిధ ప్రభుత్వ భవనాలు, పాఠశాల నిర్మాణాలకు పోనూ రహదారి వెంబడే 20 ఎకరాలకు పైబడి ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. ఈ ప్రాంతంలో రోడ్డుపక్క భూములు ఎకరా రూ.50 లక్షల వరకు ధర పలుకుతున్నాయి. గతంలో ఈ భూముల దురాక్రమణను అప్పటి రెవెన్యూ అధికారులు గుర్తించి పీఓబీ (ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్)లో నమోదు చేశారు. అయినా ఐదెకరాలు వరకు ఆక్రమణకు గురైంది. నాలుగు నెలలు కిందట సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మాజీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో స్థానిక అధికార పార్టీ నాయకులు కొందరు సుమారు పదెకరాల భూమిని ఆక్ర మించేందుకు ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారులు ఇది గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. మళ్లీ అదే మాజీ ప్రజాప్రతినిధి సహకారం, సూచనలతో మూడ్రోజుల నుంచి పట్టపగలే పీఓబీ కింద ఉన్న పదెకరాల ప్రభుత్వ భూమిని యంత్రాలతో హద్దులు నిర్ణయించి ట్రాక్టర్లతో దున్ని సాగుకు అనువుగా మార్చుకుంటున్నారు. ఈ దందాలో సూళ్లూరుపేట నియోజకవర్గం మాజీ ప్రజాప్రతినిధికి కూడా వాటా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులు తెలిసినా చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రైతు భూములపైన రాబందులు
ఏర్పేడు: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం గుంటకిందపల్లిలో ఓ సామాన్య రైతు సాగు చేసుకుంటున్న పొలం దురాక్రమణకు అధికార పార్టీ అండతో ఓ వ్యక్తి ప్రయత్నించారు. జేసీబీ సాయంతో పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి, పొలంలో ఉన్న రేకుల షెడ్డు, వ్యవసాయ బోరు మోటారును ధ్వంసం చేశాడు. బాధితుని కథనం మేరకు.. గుంటకిందపల్లికి చెందిన పరమేశ్వరి, దేవి, వాణిశ్రీ అనే మహిళల పేరుతో సర్వే నంబరు 8లోని 6.1 ఎకరాల పొలాన్ని 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదలకు భూపంపిణీ కింద ఇచ్చారు. అప్పటి నుంచి ముగ్గురు మహిళలు ఆ పొలానికి చుట్టూ ఫెన్సింగ్, లోపల రేకుల షెడ్డు, బోరుమోటారు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమి తనదంటూ ఆనంద్ అనే టీడీపీకి చెందిన నేత గురువారం ఎవరూ లేని సమయంలో పొలం వద్దకు చేరుకుని జేసీబీ తీసుకొచ్చి పొలంలోని రేకుల షెడ్డు, బోరుమోటారును కూల్చివేసి ధ్వంసం చేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
టీడీపీ వాళ్లా.. అయితే వదిలేద్దాం!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని పలువురు టీడీపీ నేతలు రెచ్చిపోతు న్నారు. వక్ఫ్ భూముల్లో ఎక్కడికక్కడ పాగా వేసి దర్జాగా అనుభవిస్తూ జేబులు నింపుకుంటున్నారు. కృష్ణా జిల్లా తాడిగడపలోని సర్వే నంబర్ 176లో 12.92 ఎకరాల వక్ఫ్ భూమిని ఆక్రమించిన ఘనుడు ఈ సంక్రాంతి మూడు రోజులు ‘బరి’ తెగించి కోడి పందాలు నిర్వహించాలనుకుంటే, చివరి ఘడియలో అధికారులు అడ్డుకోవడంతో భంగపడ్డాడు. ఇప్పుడు ఆ భూమిని సాగుకు ఇచ్చేందుకు అధికారులు జనవరి 31న బహిరంగ వేలం నిర్వహిస్తామని ప్రకటించడంతో పెద్దపులిపాకకు చెందిన టీడీపీ నేతలకు అక్రమంగా సబ్ లీజ్‌కు ఇచ్చేశాడు. దీంతో వారు రాత్రికి రాత్రే ఆ భూముల్లో అడ్డగోలుగా వరినాట్లు వేసేశారు. వెంటనే వక్ఫ్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించి తహసిల్దార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేస్తే ఇప్పుడేమి చేయలేమని.. తర్వాత చూద్దామని తీరిగ్గా బదులిచ్చారు. ఆక్రమణదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనే విషయంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఎందుకంటే అతనికి టీడీపీ నేతల అండదండలు ఉండటమే కారణం. ఇదే రీతిలో మంత్రి ఫరూక్‌కు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న టీడీపీ నేత ఒకరు అనంతపురం మసీదు ఆస్తులను 40 ఏళ్లుగా అడ్డగోలుగా అనుభవిస్తున్నాడు. నిబంధనల ప్రకారం అతను ముతవల్లిగా ఎన్నిక కాకుండానే నియామకం అయినట్టు చెప్పుకొని అధికార దుర్విని యోగానికి పాల్పడుతూ షాపింగ్ కాంప్లెక్స్ లీజుల పేరుతో అక్రమంగా జేబులు నింపుకొంటున్నాడు. ముతవల్లీలకు రాష్ట్ర నాయకుడిగా ఎన్నికైనట్టు ప్రకటించుకుని వక్ఫ్ ఆస్తులను అనుభవిస్తున్న అతనిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, టీడీపీ నేతలు సన్మానాలు చేసి అక్రమాలకు తమ వంతు ఆశీస్సులు అందిస్తుండటం విస్తుగొలుపుతోంది. కడప నాగరాజుపేటలో సర్వే నంబర్ 18లో దర్గాకు చెందిన రూ.కోట్లు విలువైన భూమిని టీడీపీ నాయకుడు ఆక్రమించాడు. ప్రొద్దుటూరులో సుమారు రూ.70 కోట్ల విలువైన సర్వే నంబర్ 305/ఎలో 3.10 ఎకరాలు టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి సోదరుడే ఆక్రమించుకోవడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.బరితెగించి దందాలు..రాష్ట్రంలో 2014–19లో యథేచ్ఛగా సాగిన వక్ఫ్ భూముల ఆక్రమణల పర్వం కూటమి సర్కారు రాకతో మళ్లీ ఊపందుకుంది. వక్ఫ్ భూములపై పచ్చ నేతలు పంజా విసరడంతో అధికారులు అటువైపు చూసే సాహసం చేయలేక పోతున్నారు. కూటమి నేతల ఆశీస్సులతో ఆక్రమించుకున్న భూములను అనుభవించేందుకు అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ముస్లిం సమాజానికి చెందిన సంస్థలు, సేవకులకు జీతభత్యాలు, విద్యా, వైద్యం వంటి సామాజిక ప్రయోజనాల కోసం శతాబ్దాలు, దశాబ్దాల క్రితం దాతలు భూములు వక్ఫ్ చేశారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో 3,502 వక్ఫ్ సంస్థలకు 65,783.88 ఎకరాల భూమి దానంగా సంక్రమించింది. వాటిలో ఏళ్ల తరబడి ఆక్రమణలపాలైనవి, అన్యాక్రాంతమై అనేక వివాదాల్లో ఉన్నవి, కోర్టు కేసుల్లో 31,594.20 ఎకరాలున్నాయి. ప్రస్తుతం 29,578.21 ఎకరాలు ఎటువంటి వివాదాలు లేకుండా ఉన్నాయి. ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీల నియంత్రణలో ఉన్న ఆస్తులకు సంబంధించి వక్ఫ్ ప్రాపర్టీస్ లీజు నియమాలు–2014ను అనుసరించి వ్యవసాయ అవసరాల కోసం భూములను లీజుకు ఇస్తున్నారు. దానిపై వచ్చే ఆదాయంతో ఆయా సంస్థలను నిర్వహిస్తున్నారు. వక్ఫ్ భూములు, సంస్థల ద్వారా వచ్చే ఆదాయంలో ఏడు శాతాన్ని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు నిర్వహణ కోసం చెల్లిస్తారు. మిగిలిన మొత్తాన్ని ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీల ఆధ్వర్యంలో ఈద్గా, దర్గాలు, మసీదులు వంటి సంస్థల నిర్వహణ, సేవకులకు జీతభత్యాలు, ముస్లిం సమాజానికి అవసరమైన సాయం అందించేందుకు ఉపయోగిస్తారు. కాగా, వక్ఫ్ సంస్థలకు చెందిన అనేక షాపింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయం నేరుగా వక్ఫ్ బోర్డుకే చెందాలి. అయితే కూటమి నేతల మితిమీరిన జోక్యం, బెదిరింపులతో అసలు లక్ష్యం పక్కదోవ పడుతోంది. ఎన్నికల హామీని అమలు చేసిన జగన్ వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకున్నారు. ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ చట్టం–1995 ప్రకారం గత ప్రభుత్వం సర్వే కమిషనర్ ద్వారా నోటిఫై చేయని వక్ఫ్ ఆస్తుల కోసం 2వ సర్వేను నిర్వహించింది. గుంటూరు, కృష్ణాŠ, ప్రకాశం, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సర్వే నిర్వహించి.. 3,295 వక్ఫ్ ఆస్తులను గుర్తించి గెజిట్ నోటిఫికేషన్‌కు చర్యలు చేపట్టింది. గెజిట్ నోటిఫికేషన్ అయిన వక్ఫ్ ఆస్తులను అధునాతన సాంకేతిక పద్దతిలో జీఐఎస్, జీపీఎస్ మ్యాపింగ్ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల్లో సుమారు 223 వక్ఫ్ భూములు, 3,772 మసీదులు, దర్గాలకు అనుబంధమైన ఆస్తులను మ్యాపింగ్ చేశారు. దీనికితోడు ఆక్రమణల నుంచి 580.32 ఎకరాలను రికవరీ చేయగలిగారు. వక్ఫ్ భూములకు సంబంధించిన రికార్డులను కంప్యూటరీకరణ చేశారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కలెక్టర్ చైర్మన్‌గా జిల్లాల వారీగా రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు చొప్పున పెంచి అందించారు.వక్ఫ్ సర్వే నిర్వహించి ఆస్తులు కాపాడాలిరాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది. రెండవ సర్వే నిర్వహించి వక్ఫ్ ఆస్తులను ఆక్రమణలను వెలికితీసి స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరికాదు. వక్ఫ్ సర్వేను నిర్వహించి దాతలు పెద్ద మనస్సుతో ఇచ్చిన ఆస్తులను కాపాడాలి. ఆక్రమణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చట్టప్రకారం చర్యలు చేపట్టాలి. – షేక్ దస్తగిరి, అధ్యక్షుడు, ముస్లిం దూదేకుల జేఏసీటీడీపీ డబుల్ గేమ్‌ను ముస్లిం సమాజం గమనిస్తోందివక్ఫ్ సవరణ బిల్లు విషయంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడింది. ముందు నుంచి ముస్లిం సమాజ హితం కోరుతున్న వైఎస్ జగన్ ఆదేశాలతో వైఎస్సార్సీపీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపించారు. ఇప్పుడు వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలోనూ కూటమి ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ముస్లిం సమాజం గమనిస్తోంది. ఇప్పటికైనా వక్ఫ్ ఆస్తులు ఆక్రమించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.– కాగజ్‌ఘర్ రిజ్వాన్, అనంతపురం జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ -
టీడీపీ నేత భూమేతకు చెక్!
సాక్షి టాస్క్‌ఫోర్స్ : అటవీ భూములంటే ఆ టీడీపీ నేతకు సొంత ఆస్తి కింద లెక్క. సుమారు పదెకరాలకు పైగా ఆక్రమించేసి ఏకంగా జామాయిలు చెట్లును పెంచాడు. ఇదేమని అడిగిన ఆ శాఖ అధికారులను బెదిరించడం.. చట్టంలో ఉన్న లొసుగులను అనుకూలంగా మార్చుకుని అధికారులను కోర్టులు చుట్టూ తిప్పడం ఆ నేతకు వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడితని ఆగడాలకు చెక్‌పడడంతో కటకటాలపాలయ్యాడు. వివరాలివీ.. తిరుపతి జిల్లా డక్కిలి మండలం డీఉప్పరపల్లి (గొల్లపల్లి) గ్రామానికి చెందిన పావులూరు భాస్కర్‌నాయుడు టీడీపీ నేతగా చలామణి అవుతున్నాడు. గ్రామంలోని సర్వే నెంబరు 59లో సుమారు పదెకరాలకు పైగా అటవీ భూమిని అక్రమించాడు. అందులో జామాయిల్ మొక్కలను పెంచి ఒక దఫా కటింగ్ చేసి సొమ్ము చేసుకున్నాడు. మళ్లీ గత ఏడాది జూలైలో కటింగ్ చేసేందుకు ఆయన ప్రయత్నించగా అధికారులు అడ్డగించి నోటీసులిచ్చారు. అయితే, వాటిని తీసుకునేందుకు భాస్కర్‌నాయుడు నిరాకరించాడు. మరోవైపు.. ఇదే గ్రామంలో మరికొంతమందితో కలిసి అటవీభూమిని రాత్రిపూట ఆక్రమించి నిమ్మ మొక్కలను సాగుచేశాడు. దీంతో అటవీశాఖ అధికారులు అతనిపై భూ ఆక్రమణ కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ, అటవీ శాఖాధికారులు ఈయన సాగుచేస్తున్న భూముల్లో ఇటీవల ఉమ్మడి సర్వే నిర్వహించారు. అవన్నీ అటవీశాఖ పరిధిలోకే వస్తాయని తేల్చి నివేదికను జిల్లా అధికారులకు సమాచారం అందించారు. అదుపులో భాస్కర్‌నాయుడు..దీంతో.. తిరుపతి జిల్లా డీఎఫ్ఓ వికాస్, సబ్ డీఎఫ్ఓ నాగభూషణం ఆదేశాలు మేరకు వెంకటగిరి ఇన్చార్జి రేంజ్ లోకేష్, బాలాయపల్లి డీఆర్వో సుభాషిణి ఆధ్వర్యంలో వెంకటగిరి రేంజ్, టాస్క్‌ఫోర్స్‌కు చెందిన సుమారు 25 మంది శుక్రవారం రాత్రి డీ.ఉప్పరపల్లిలో ఉన్న భాస్కర్‌నాయుడును అదుపులోకి తీసుకుని వెంకటగిరిలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఆయనను నెల్లూరు జైలుకు తరలించారు. ఇప్పటికే ఇతనిపై అటవీశాఖకు సంబంధించిన కేసులు నమోదై ఉండడంతో ప్రస్తుతం అటవీశాఖ అధికారులు నాన్ బెయిలబుల్ కేసు నమోదుచేశారు.2007లోనే అటవీ భూములను రిజిస్ట్రేషన్..నిజానికి.. భాస్కర్‌నాయుడుకు ముందునుంచి అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడడం.. ఆ భూములను విక్రయించి సొమ్ము చేసుకోవడం అలవాటుగా మారింది. 2007లో డీ.ఉప్పరపల్లిలోని 32 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ఆ భూములకు సంబంధించి ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలు సృష్టించాడు. వాటిని నెల్లూరుకు చెందిన పామూరు నిరంజన్‌రెడ్డి, కృష్ణపట్నం సులోచనలకు తన కుటుంబ సభ్యులైన ఆరుగురి పేరుతో విక్రయించాడు. అప్పట్లో ఈ విషయం సంచలనమైంది. అంతేగాక.. ఫోర్జరీ సంతకాలతో పాసు పుస్తకాలు, తహసీల్దార్ పేరుతో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఫోర్జరీ వంటి విషయాలు వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు డక్కిలి పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ నేతపై అక్రమ కేసు..ఇదిలా ఉంటే.. టీడీపీ నేత పావులూరు భాస్కర్‌నాయుడు అటవీ భూముల్లో జామాయిల్ చెట్లను నరికి అక్రమంగా తరలించగా.. ఇప్పుడా పార్టీ అధికారంలోకి రాగానే డీ.ఉప్పరపల్లికే చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, సొసైటీ మాజీ అధ్యక్షుడు బొల్లినేని భాస్కర్‌నాయుడే చెట్లు నరికినట్లు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో డక్కిలి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. -
హైదరాబాద్ పరిధిలో చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు పోటెత్తుతున్న ఫిర్యాదులు
-
గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములు స్వాధీనం
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్శిటీలో ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం 36 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకోగా, గతంలో ప్రారంభించిన ప్రక్రియకు కొనసాగింపుగా తాజాగా సర్వే నంబర్ 15,16,19,20 పరిధిలోని 4.36 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్‌ను రెవెన్యూ సిబ్బంది వేయిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా గీతం వర్శిటీ అవసరాలకు ప్రభుత్వ భూములను వినియోగించుకుంటోంది. అన్యాక్రాంతమైన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సాక్షి ఎఫెక్ట్: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు -
400 ఏళ్ల క్రితమే పక్కా ప్లాన్‌తో బెంగళూరు నిర్మాణం.. నేటి దుస్థితికి కారణాలేంటి?
చెరువుల నగరంగా ఒకప్పుడు పేరున్న బెంగళూరులో ఆ చెరువులు, వాటి అనుబంధ కాలువలు ప్రభుత్వ నిర్మాణాలకు, కబ్జాల వల్ల అదృశ్యమైపోయాయి. ఫలితంగా వర్షాలు వస్తే ఆ నీరు ఒకప్పుడు జల వనరులు ఉన్న చోటికే వెళ్తోంది. చివరికి ముంపు తయారవుతోంది. దీనివల్ల లక్షలాది జీవితాలు అవస్థల పాలయ్యాయి. బెంగళూరు: నాలుగు వందల ఏళ్ల కిందటే నాడప్రభు కెంపేగౌడ పకడ్బందీ ప్రణాళికతో నిర్మించిన చారిత్రక నగరం బెంగళూరు నేడు మామూలు వర్షానికే గజగజ వణికిపోవడం చూస్తే పరిస్థితి ఎంత దుర్భరంగా తయారైందో ఇట్టే అర్థమవుతుంది. నగరంలో పకడ్బందీగా ఉన్న రాజ కాలువలు వారూ వీరూ అని తేడా లేకుండా ఆక్రమణలకు పాల్పడి ఇళ్లు, భవనాలు కట్టేయడం, చెరువులను చదును చేసి లేఔట్లు నిర్మించడం వల్ల నైసర్గిక స్వరూపాలే మారిపోయి విపత్తులు పుట్టుకొస్తున్నాయి. ఉన్న చెరువులు, కాలువల్లో కూడా పూడిక పెరిగిపోయింది. వాతావరణ మార్పుల వల్ల ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురవడం మరో కారణం. వర్షపు నీరు రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి చొరబడటంతో ముంపు తలెత్తుతోంది. బెల్లందూరు చెరువు దుస్థితి బెంగళూరు నగరంలో చెరువుల స్థానంలో నిర్మించిన కట్టడాల వివరాలు ►శూలె చెరువులో ఇప్పుడు ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణమైంది. అక్కితిమ్మనహళ్లి చెరువు– హాకీ స్టేడియంగా, సంపంగి చెరువు –కంఠీరవ స్పోర్ట్ కాంప్లెక్సా్గ, ధర్మాంబుధి చెరువు–కెంపేగౌడ బస్టాండుగా, చల్లఘట్ట చెరువు–కర్ణాటక గోల్ఫ్ మైదానంగా మారిపోయాయి. ►కోరమంగల చెరువు– నేషనల్ గేమ్స్ కాంప్లెక్స్ మైదానం, సిద్దికట్టె చెరువు–కేఆర్.మార్కెట్‌గా, కారంజీ చెరువు–గాంధీ బజార్, కెంపాబుధి చెరువు–భూగర్భ డ్రైనేజీ సేకరణ ట్యాంక్‌గా మారిపోయాయి. ►నాగశెట్టిహళ్లి చెరువు– స్పేస్ డిపార్టుమెంట్, కాడుగొండనహళ్లి చెరువు–అంబేడ్కర్ మెడికల్ కాలేజీ, దుమ్మలూరు చెరువు–బీడీఏ లేఔట్, మిల్లర్స్ చెరువు–గురునానక్ భవన్ అయ్యాయి, ►సుభాష్ నగర చెరువు, కురబరహళ్లి చెరువు, కోడిహళ్లి చెరువు, సినీవాగిలు చెరువు, మారేనహళ్లి చెరువులు నేడు నివాస ప్రాంతాలుగా మారాయి. ►శివనహళ్లి చెరువు–క్రీడా మైదానం, బస్టాండుగా రూపాంతరం చెందాయి. ►చెన్నమనచెరువు –స్మశానం, పుట్టేనహళ్లి చెరువు– జేపీ నగర 6వ ఫేజ్, జక్కరాయనచెరువు – క్రీడా మైదానం అయ్యింది. మారతహళ్లిలో బోటులో వెళ్తున్న జనం నగరానికి ఏటా రూ.20 వేల కోట్లు ఖర్చు ప్రతి ఏడాది బెంగళూరు నగరాభివృద్ధి నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ వరద ముంపు సమస్యను తప్పించడం సాధ్యం కావడం లేదు. బీబీఎంపీ బడ్జెట్ సుమారు రూ.11 వేల కోట్లు కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరో రూ.10 వేల కోట్ల నిధులు లభిస్తాయి. ఇలా ప్రతి ఏడాది రూ. 20 వేల కోట్లను బెంగళూరుపై ఖర్చు చేసినప్పటికీ ప్రజల సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఒకనాటి పొలాలు, చిట్టడవులు మాయం ►అందుకే ఇంత ముప్పు! ప్రకృతిని కాపాడుకోకపోవడమే ఈ వరద ముంపునకు కారణమని పర్యావరణవాదులు పేర్కొన్నారు. ప్రస్తుతం వర్షంతో జలమయమైన బెంగళూరులోని లేఔట్లు గతంలో పొలాలు, చెరువులు, అచ్చుకట్ట ప్రాంతాలు, చిట్ట అడవులతో కూడుకున్న ప్రదేశాలు. గత పది, ఇరవై ఏళ్లలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో భారీఎత్తున లేఔట్లు, కట్టడాలు, రోడ్లు నిర్మించారు. ఇప్పుడు కుండపోత వర్షాలకు చెరువుల్లా తయారయ్యాయి. ఏ ప్రాంతంలో ముందు చెరువు ఉండేది, ఎక్కడ రాజ కాలువ ఉండేది అనేదానిని ప్రస్తుత ముంపు చాటిచెబుతోందని పరిసరవాదులు అభిప్రాయపడ్డారు. రెయిన్ బో లేఔట్లో తీరని ముంపు కష్టం ప్రధానంగా బెల్లందూరు, వర్తూరు, విభూతిపుర, సావళచెరువు, బేగూరు చెరువు చుట్టుపక్కల లేఔట్లు ప్రస్తుతం భారీ వర్షాలతో జలంలో చిక్కుకున్నాయి. ఈ చెరువుల విస్తీర్ణం గత 40 ఏళ్లతో పోలిస్తే సగానికి సగం తగ్గిపోయింది. ఈ చెరువులకు వెళ్లే రాజ కాలువలపై కట్టడాలు వెలిశాయి. అక్రమ కట్టడాలను తొలగించాల్సిన ప్రభుత్వం సక్రమ పథకంతో అనుకూలం చేయడం ప్రకృతికి మంచి చేయదని పరిసరవాది యల్లప్పరెడ్డి విచారం వ్యక్తం చేశారు. -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
క్రమబద్ధీకరణతో అడవుల ఆక్రమణకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోడు క్రమబద్ధీకరణ పేరిట మళ్లీ అటవీ ఆక్రమణలకు అవకాశం ఇవ్వొద్దని పర్యావరణ నిపుణులు, జంతు ప్రేమికులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు సూచిస్తున్నారు. గతంలో చేసిన ఆక్రమణలను కొత్తగా క్రమబద్ధీకరిస్తామంటే అడ్డూ అదుపూ లేకుండా అటవీ విధ్వంసం జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు హరితహారం పేరిట గత ఏడేళ్లుగా చేపట్టిన బృహత్ కార్యక్రమం ద్వారా సాధించిన మంచి ఫలితాలు కూడా కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధ, గురు, శుక్రవారాల్లో పోడు సమస్య అధ్యయనానికి, క్షేత్ర స్థాయి వాస్తవాల సేకరణను అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు చేపడుతున్నారు. పోడు సమస్య పరిష్కారం, అడవుల పరిరక్షణ వంటి ప్రధాన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 23న జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. సరైన దిశలో నిర్ణయాలు తీసుకోవాలి.. మొత్తంగా అటవీ ఆక్రమణలను పోడుగా పరిగణించకుండా, అటవీ భూమిని సాగుచేసే నిజమైన ఆదివాసీ గిరిజనులను గుర్తించాలి. ఏళ్లకొద్దీ సాగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నించడం మంచిదే. అయితే ఈ దిశలో సర్కారు తీసుకునే నిర్ణయాలు అటవీ హక్కులు, అటవీ పరిరక్షణ చట్టాలు, భారత అటవీ చట్టం వంటి చట్టపరమైన సమీక్షకు నిలబడలేవు. అదీగాక పోడును క్రమబద్ధీకరిస్తామనే ప్రభుత్వ సంకేతాలతో అటవీ భూములను ఆక్రమించి వ్యవసాయం చేస్తే వాటిపై ఎప్పటికైనా హక్కులు లభించొచ్చుననే దురాశతో ఇబ్బందులు తలెత్తుతాయి. హరితహారం పేరిట సాధించిన ఫలితాలు, ప్రయోజనాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది. – ఇమ్రాన్ సిద్దిఖీ, జంతు ప్రేమికుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ పోడు పేరిట విధ్వంసం.. ఆదివాసీలు, గిరిజన జనాభా లేని చోట్ల కూడా ఆదివాసీ చట్టాన్ని అమలు చేస్తామనడం సరికాదు. అడవిని విధ్వంసం చేసి గిరిజనేతరులకు కూడా పునరావాసం కల్పించాలనేది కూడా మంచిది కాదు. 2006లో కేంద్రం సవరించిన అటవీహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం.. పోడు, అటవీ ఆధారిత గిరిజన , ఆదివాసీలకు మాత్రమే మెరుగైన జీవితం కోసం కొంత పోడు చేసిన అటవీ ప్రాంతం విధ్వంసానికి గురికాకుండా చేయాలి. అందువల్ల పోడు అంశాన్ని మళ్లీ పునఃసమీక్షించడం సరికాదు. ఇది పూర్తిగా అశాస్త్రీయం. అటవీ చట్టమనేది పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలోనిది. రిజర్వ్ ఫారెస్ట్‌ను డీరిజర్వ్ చేయడానికి కూడా రాష్ట్రానికి అధికారం లేదు. 15 ఏళ్ల సుదీర్ఘకాలం దాటాక కూడా (2006లో కొత్త చట్టం అమల్లోకి వచ్చాక) పునర్ సమీక్షించి, 2000 చట్టాన్ని అమలు చేస్తామనడం సమర్థనీయం కాదు. వాస్తవానికి ఇప్పటిదాకా ఎంత మంది గిరిపుత్రుల కుటుంబాలకు ఎన్ని లక్షల ఎకరాల్లో పోడు పట్టాలిచ్చారు. పోడు పేరిట సహజసిద్ధమైన అటవీ వనరులకు నష్టం చేసే ప్రయత్నాలు కూడా చేయకూడదు. – పోట్లపల్లి వీరభద్రరావు, పర్యావరణవేత్త, న్యాయవాది గిరిపుత్రులకు నిజమైన లబ్ధి చేకూరుతోందా? అడవుల పరిరక్షణ, అభివృద్ధి, పోడు భూములకు పట్టాలు వంటి అంశాల విషయంలో ప్రభుత్వం, పౌరసమాజం తాము అనుసరిస్తున్న విధానాలు, పద్ధతులను సమీక్షించుకోవాలి. అభివృద్ధి పేరిట అడవులకు, పోడుభూముల పేరిట ఆదివాసీ, గిరిపుత్రులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తున్నామనేది ఆత్మపరీక్ష చేసుకోవాలి. పోడు చేసుకునే వారికి పట్టాల అందజేతకు మళ్లీ కొత్తగా అవకాశాలిస్తామంటే ఈ నెపంతో జరిగే విధ్వంసం ఇక్కడితో ఆగదు. దీనివల్ల మళ్లీ కొత్తగా పోడు కొట్టే ప్రమాదం ఉంది. రాజకీయ నేతల అండదండలున్న వారికి, గిరిజనేతరులకే ఈ ప్రయోజనాలు దక్కుతాయి – సరస్వతి రావుల, పర్యావరణవేత్త, నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్ (ఎన్ఏపీఎం) పూర్వ కన్వీనర్ -
చైనాపై జపాన్ దురాక్రమణ డ్రాగన్ సీడ్
1930వ దశకంలో చైనా పల్లీయులు రేడియోలు ఎరగరు. వారికి వార్తాపత్రికలు తెలియవు. వారున్న గ్రామానికి వెలుపల ఒక ప్రపంచమున్నదనే తెలీదు. యింటికి పుస్తకం వచ్చిన రోజుని ఒక దుర్దినంగా ఆ యింటి యజమానురాలు భావిస్తుంది. యీ లక్షణాలన్నీ నవలలో కనపడతాయి. ప్రఖ్యాత పాశ్చాత్య రచయిత్రి పెర్ల్ ఎస్. బక్ చైనీయుల గురించి రచించిన గొప్ప నవలలో ప్రసిద్ధి పొందిందీ, ఆమెకు నోబెల్ బహుమతిని తెచ్చి పెట్టిందీ ‘ద గుడ్ ఎర్త్’(1931). ఆ తరువాత అంత ప్రాచుర్యాన్నీ పొందిన నవల ‘డ్రాగన్ సీడ్’(1942). యీ నవలని హాలీవుడ్ చిత్రంగానూ నిర్మించారు. చిత్రం విజయవంతమైంది. బక్ 1892లో అమెరికాలో జన్మించినప్పటికీ అనేక కారణాల వల్ల వివిధ దశల్లో చైనాలో చాలాకాలం నివసించారు. వారి జీవితాన్ని దగ్గరగా పరికించారు. చైనీస్ భాషని నేర్చుకున్నారు. అక్కడి గ్రామీణ జీవితంతో ఆమెకు బాగా పరిచయం వున్నది. చివరికి చైనా రాజకీయ విధానాలతో విసుగెత్తి అమెరికా తిరిగి వచ్చారు. రచయిత్రిగా, సంఘసేవకురాలిగా మనుగడ సాగించి 1973లో మరణించారు. డ్రాగన్ సీడ్ పేరులోనే ప్రత్యేకత వున్నది. చైనా సాంప్రదాయ రీతిలో డ్రాగన్ అనేది దుష్ట జంతువు కాదు. దాన్ని వారు పిలిస్తే పలికే దైవంగా ఆరాధిస్తారు. ఆ మాటనే శాంతీ ప్రగతీ శౌర్య పరాక్రమాలకు ప్రతీకగా భావిస్తారు. అటువంటి ‘అంకురం’ యీ నవల్లో కనపడుతుంది. ఈ దాడి జరిగిన కాలంలో పెర్ల్ బక్ చైనాలో లేదనీ, యీ నవలకు సంబంధించిన ముడి సమాచారాన్ని ఆమె సేకరించి వ్రాసారనే విమర్శలున్నప్పటికీ యిది గొప్ప నవలల కోవకి చెందుతుంది. లైఫ్ మేగజైన్ వారి 1924–44 మధ్య వెలువడిన వంద గొప్ప పుస్తకాల జాబితాలో చోటు సంపాదించుకొంది. 1937లో చైనాను జపాన్ దురాక్రమణ చేసింది. జపాన్ సైనికులు చేసిన మారణహోమాన్ని ‘నాంకింగ్ మానభంగం’ అని చైనా చరిత్రలో పేర్కొంటారు. ఆ దౌర్జన్య కాండే యీ నవలకు నేపథ్యం. దాని ఫలితంగా ఛిన్నాభిన్నమైన అమాయక రైతు కుటుంబమే యీ నవలకు కథావస్తువు. సాటి మానవుడే శత్రువు రూపంలో దానవుడై వినాశనానికీ విధ్వంసానికీ పాల్పడినప్పటికీ దాన్ని తట్టుకొని మరో మానవుడు నిలబడగలడనీ మనగలడనీ యీ నవల ఒక ఆశావాదాన్ని ప్రబోధిస్తున్నది. వాస్తవ జీవితంలో లాగే నవలలోనూ బహుపాత్రలుంటాయి. కథనం నాంకింగ్ పట్టణానికీ అక్కడికి కాలినడక దూరంగా వున్న వ్యవసాయాధారిత పల్లెకూ మధ్య నడుస్తుంది. చైనీయుల జీవన విధానాన్ని సరళమైన ఇంగ్లిష్ శైలిలో బక్ అద్భుతంగా వర్ణించి విశదీకరిస్తారు. లింగ్టాన్ ఒక చైనీస్ పల్లె రైతు. శత్రువు జీవితాల్ని విచ్ఛిన్నం చేయగలడు; సంపదల్ని కొల్లగొట్టగలడు; కానీ నేలను మాత్రం అపహరించలేడు అన్న ఉద్దేశంతో వ్యవసాయాన్ని నమ్ముకున్నవాడు. అనుకూలవతిౖయెన భార్యా, వ్యవసాయానికి తగిన దృఢ శరీరం గల ముగ్గురు కొడుకులూ, ఆపైన యిద్దరు కుమార్తెలూ, యిద్దరు కోడళ్ళూ వున్నారు. మనుమలున్నారు. పెద్దకుమార్తె భర్తతో పట్నంలో వుంటున్నది. వారికీ పిల్లలున్నారు. సారవంతమైన చైనా నేల వారి కుటుంబానికి జీవనాధారంగా విలసిల్లుతున్నది. అందరూ ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. 1930వ దశకంలో నాటి చైనా పల్లీయులు రేడియోలు ఎరగరు. వారికి వార్తాపత్రికలు తెలియవు. అసలు వారున్న గ్రామానికి వెలుపల ఒక ప్రపంచమున్నదనే తెలీదు. యీ లక్షణాలన్నీ నవలలో కనపడతాయి. నిరక్షరాస్యత కరడుగట్టి వున్నది. నవలలో ఆ యింటికి ఒక పుస్తకం వచ్చిన రోజుని ఒక దుర్దినంగా ఆ యింటి యజమానురాలు భావిస్తుంది. జపాన్ వారి దురాక్రమణ చైనా వారి జీవితాల్లో కల్లోలం రేపింది. విమానాల ద్వారా బాంబులు వర్షించాయి. పట్టణాలు నేలమట్టమైనాయి. ఆరువారాల పాటు సైనికుల హింసా కాండ నిరాఘాటంగా కొనసాగింది. చైనా పాలకులు పరారైనారు. వారి సైన్యం చెల్లాచెదురైంది. రెండులక్షల మంది చనిపోయారు. వేలాదిమంది క్షతగాత్రులుగానూ, నిరాశ్రయులుగానూ మిగిలిపోయారు. పల్లెలు ఆక్రమితమైనాయి. జీవనాధారమైన వారి పంటలు నాశనమైనాయి. చైనా భూభాగమే రక్తసిక్తమైంది. వీటన్నిటినీ నవల్లో సందర్భోచితంగా చక్కగా చిత్రించారు రచయిత్రి. లింగ్టాన్ యింట్లో శాంతి భగ్నమైంది. అతడి వృద్ధ వియ్యపురాలూ, కోడలూ మానభంగానికీ హత్యకూ గురైనారు. సైనికులు స్త్రీల శవాలనూ అనుభవించడం మానవ చరిత్రలోనే మాయనిమచ్చగా మిగుల్తుంది. చివరకు స్త్రీలు లభించకపోవడంతో లింగ్టాన్ అందమైన చిన్న కొడుకునే మానభంగం చేస్తారు. వాడు సిగ్గుతో యిల్లు వదలి కొండలు పట్టిపోతాడు. భయభ్రాంతులైన ప్రజలు యిళ్ళూవాకిళ్ళూ వదలి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పశ్చిమాన వున్న పర్వత ప్రాంతాలవైపు వలసపోసాగారు. లింగ్టాన్ రెండో కొడుకూ కోడలూ వారి వెంట వెళ్ళారు. అంతవరకూ ఐక్యతతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబం చెట్టుకో పిట్టగా చెదిరిపోయారు. వ్యాపారమే పరమావధి కాగా శత్రువుతో కూడా సహజీవనం చెయ్య గల వ్యక్తులకు ప్రతినిధిగా లింగ్టాన్ అల్లుడు నిలుస్తాడు. ఆ రోజుల్లోనే చదువుకున్న విప్లవ వనితగా రెండో కోడలు నిలుస్తుంది. ఆమె ముసలి వేషంలో వెళ్లి, విందులో పాల్గొంటున్న శత్రువులకు విషం నింపిన బాతుల్ని అమ్మి వారంతా చనిపోయేటట్టు చెయ్యగలుగుతుంది. దుఃఖంతో కృంగిపోయిన లింగ్టాన్ కుటుంబం ధైర్యాన్ని కూడగట్టుకొని తిరుగుబాటు బాటపట్టింది. గ్రామస్తులు దళాలుగా ఏర్పడి దొరికిన శత్రువుని మట్టుబెట్టడం నేర్చుకున్నారు. తన గ్రామ దళానికి లింగ్టాన్ నాయకత్వం వహిస్తున్నాడు. చీమకు కూడా అపకారం చెయ్యని అతడు శత్రువు పట్టుబడితే చాలు నిర్దాక్షిణ్యంగా చంపుతున్నాడు. అతని భార్య కూడా నైతిక బలాన్నిస్తున్నది. అతని కుమారులూ, ఆ గ్రామ యువకులూ కలిసి ఆ యింట్లోనే ఒక నేల మాళిగ ఏర్పాటు చేసుకున్నారు. అందులోనే ఆయుధాలు దాచుకున్నారు. అక్కడే సమావేశాలు నిర్వహించి గెరిల్లా పోరాటాన్ని మొదలుపెట్టారు. చైనీయుల యీ సై్థర్యమే యీ నవలకు డ్రాగన్ సీడ్ (క్షాత్ర బీజం) అని పేరు పెట్టడానికి కారణమై వుంటుంది. రానున్న రెండో ప్రపంచ యుద్ధపు సంకేతాలు చైనా ప్రజలకు అందుతాయి. తమ శత్రువు (జపనీయులు)కు వారికన్నా బలమైన శత్రువు (అమెరికా, రష్యా) లున్నారని వారు తెలుసుకొని సంబరపడతారు. రైతాంగం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న వర్షసూచనలతో నవల ఆశావహంగా ముగుస్తుంది. యుద్ధం వల్ల కలిగే వినాశనాన్నీ, సైనికుల క్రౌర్యాన్నీ, అకృత్యాల్నీ సరళమైన యింగ్లిష్లో బక్ సమర్థవంతంగా చిత్రించారు. ఒక చారిత్రక దుశ్చర్య ఆధారంగా వ్రాసిన యీ నవల విశ్వసాహితీ లోకంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. (వ్యాసకర్త ‘డ్రాగన్ సీడ్’ నవలను తెలుగులోకి అనువదించే ప్రయత్నంలో ఉన్నారు.) -
ఆక్రమణల తొలగింపు
నెల్లూరు సిటీ: నగరపాలక సంస్థకు చెందిన రెండు రిజర్వ్డ్ స్థలాలను స్టోన్‌హౌస్‌పేటలో వాణిజ్య వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించి గదులను నిర్మించారు. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదు మేరకు టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆక్రమణల తొలగింపును చేపట్టారు. ఆదిత్యనగర్‌లో ఎల్పీ నంబర్ 94 / 92 స్థలంలోని 96 అంకణలు కలిగిన రెండు పార్క్ స్థలాలను ఆక్రమించి ప్రహరీ, రెండు గదులను నిర్మించారు. ఈ క్రమంలో 16వ డివిజన్ అభివృద్ధి కమిటీ గతేడాది నుంచి స్థలాన్ని కబ్జాదారుల చెర నుంచి కాపాడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. పలుమార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం కూడా కబ్జా పర్వాన్ని కమిషనర్‌కు వివరించారు. ఈ క్రమంలో శుక్రవారం ఏసీపీ రంగరాజు ఆధ్వర్యంలో ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసుల సాయంతో జేసీబీతో ఆక్రమణలను కూల్చేశారు. కానరాని కబ్జాదారులు కబ్జా చేసిన స్టోన్‌హౌస్‌పేటలోని వాణిజ్య వ్యాపారి, అధికార పార్టీ నేత ఆక్రమణల తొలగింపు సమయంలో కానరాలేదు. ఓ మాజీ ఎమ్మెల్యే సాయంతో కబ్జా చేశారు. ప్రస్తుతం కబ్జాను అడ్డుకుంటే తనకు చెడ్డ పేరొస్తుందనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి చేరుకోలేదని సమాచారం. టీపీఓ సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
మమ్మల్ని బెదిరించి అక్రమించుకున్నారు
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం ఖిలానగర్‌లోని తమ సొంత స్థలం 1780 చదరపు గజాలను నయీమొద్దీన్ గ్యాంగ్ బెదిరించి రిజిస్టర్ చేయించుకున్న దానిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన వారాల శ్రీనివాస్ తండ్రి వెంకటయ్య, వారాల కృష్ణ తండ్రి వారాల వెంకటయ్య, వారాల అశోక్ తండ్రి వెంకటయ్యలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు వారిమాటల్లోనే.. మాకు భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న సర్వేనెంబర్ 8లో రూ. కోటి యాబైలక్షల విలువగల ఐదు మడిగెలు, మూడు ఆర్సీసీ రూములు, ఖాళీ స్థలము మొత్తం 1780 చదరపు గజాలు ఉందన్నారు. నయీమ్ అతని అనుచరులు పాశం శ్రీనివాస్, పెంట నర్సింహ, గొర్రెంకల శివశంకర్, కొంత మంది అనుచరులతో వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నించారన్నారు. అందుకు గాను నయీమ్ అనుచరులు పాశం శ్రీను, అతని అనుచరులు హైదరాబాద్ చంపాపేట్‌లో నివసిస్తున్న మా వద్దకు పలుమార్లు వచ్చి మా ఆస్తిని ఇవ్వమని లేకుంటే మమ్ములను మాకుటుంబ సభ్యులను చంపుతామని భయబ్రాంతులకు గురిచేశారన్నారు. రూ. కోటి 50 లక్షల విలువ గల ఆస్తిని కేవలం రూ.40 లక్షలు ఇచ్చి బలవంతంగా నయీమ్ తన తరుపు బంధువుల పేరుమీద 13 డాక్యుమెంట్లు తయారు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. మా విలువైన ఆస్తిని మాకు తిరిగి ఇప్పించాలలి. అలాగే మాకు నయీమ్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలి. -
మమ్మల్ని బెదిరించి అక్రమించుకున్నారు
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణం ఖిలానగర్‌లోని తమ సొంత స్థలం 1780 చదరపు గజాలను నయీమొద్దీన్ గ్యాంగ్ బెదిరించి రిజిస్టర్ చేయించుకున్న దానిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన వారాల శ్రీనివాస్ తండ్రి వెంకటయ్య, వారాల కృష్ణ తండ్రి వారాల వెంకటయ్య, వారాల అశోక్ తండ్రి వెంకటయ్యలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు వారిమాటల్లోనే.. మాకు భువనగిరి పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న సర్వేనెంబర్ 8లో రూ. కోటి యాబైలక్షల విలువగల ఐదు మడిగెలు, మూడు ఆర్సీసీ రూములు, ఖాళీ స్థలము మొత్తం 1780 చదరపు గజాలు ఉందన్నారు. నయీమ్ అతని అనుచరులు పాశం శ్రీనివాస్, పెంట నర్సింహ, గొర్రెంకల శివశంకర్, కొంత మంది అనుచరులతో వచ్చి కబ్జా చేయాలని ప్రయత్నించారన్నారు. అందుకు గాను నయీమ్ అనుచరులు పాశం శ్రీను, అతని అనుచరులు హైదరాబాద్ చంపాపేట్‌లో నివసిస్తున్న మా వద్దకు పలుమార్లు వచ్చి మా ఆస్తిని ఇవ్వమని లేకుంటే మమ్ములను మాకుటుంబ సభ్యులను చంపుతామని భయబ్రాంతులకు గురిచేశారన్నారు. రూ. కోటి 50 లక్షల విలువ గల ఆస్తిని కేవలం రూ.40 లక్షలు ఇచ్చి బలవంతంగా నయీమ్ తన తరుపు బంధువుల పేరుమీద 13 డాక్యుమెంట్లు తయారు చేసి రిజిస్టర్ చేయించుకున్నారు. మా విలువైన ఆస్తిని మాకు తిరిగి ఇప్పించాలలి. అలాగే మాకు నయీమ్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలి. -
బస్సు ఆగని షెల్టర్లు
-
అటవీ భూమి ఆక్రమణ
హనుమాన్‌జంక్షన్ : బాపులపాడు మండలం మల్లవల్లిలో సుమారు 80 ఎకరాల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. ఆర్ఎస్ నంబర్ 11లోని ఈ భూమిని ఆక్రమించిన బడాబాబులు రాత్రి సమయాల్లో పొక్లెయిన్‌తో భూమిని చదును చేయించారు. నాలుగు అడుగుల వరలతో మూడు అడుగుల నీటితొట్టెలు 50 మీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. మామిడి మొక్కలు కూడా నాటారు. ఒకవైపు ఫెన్సింగ్ కూడా పూర్తిచేశారు. మిగిలిన మూడువైపుల గుంతలు తీసి ఫెన్సింగ్ పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేశారు. పక్షం రోజులుగా ఈ తంతు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా వున్నాయి.. ఆర్ఎస్ నంబరు 11లో 1,460 ఎకరాల అటవీ భూమి ఉంది. అందులో వంద ఎకరాలు గతంలో ఉద్యానశాఖ వన నర్సరీకి కేటాయించగా, మిగిలిన భూమి ఆక్రమణలకు గురైంది. గత కాంగ్రెస్ సర్కారు హయాంలో నిరుపేదలకు కొంత భూమి కేటాయించి బడాబాబుల ఆక్రమణలో ఉన్న భూమిని స్వాధీనం చేసుకున్నారు. నిరుపేదల ఆక్రమణలకు సంబంధించి వివరాలు సేకరించారు. ఆక్రమణలు జరిగిన, మొక్కలు నాటని భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లుగా ప్రకటించారు. అలా ఉన్న భూమి నిరుపేదల ఆధీనంలో ఉండడంతో ఇటీవల ఇద్దరు ఆక్రమణదారులు కొంత సొమ్ము ఇచ్చి స్వాధీనం చేసుకున్నారు. ఇవ్వనివారిని కూడా బెదిరించి మరికొంత భూమి స్వాధీనం చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం విలేకరుల బృందం ఈ అటవీ భూములను పరిశీలించగా ఇక్కడ జరుగుతున్న బాగోతం బట్టబయలైంది. గ్రామ వీఆర్వో ఏసుపాదంను ‘సాక్షి’ వివరణ కోరగా నైజాం ప్రభుత్వం నుంచి ఆ భూములు కొనుగోలు చేసినట్లు ఆక్రమణదారులు చెబుతున్నారని తెలిపారు. రెవెన్యూ అధికారుల హడావుడి ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించారు. హుటాహుటిన ఆక్రమిత స్థలం వద్దకు చేరుకొని ట్రాక్టర్‌తో ఫెన్సింగ్, నీటి తొట్టెలను ధ్వంసం చేశారు. ఆక్రమణలపై మండల తహశీల్దారు కె.గోపాలకృష్ణ వివరణ ఇస్తూ.. మల్లవల్లి గ్రామంలో అటవీ భూములు ఆక్రమణకు గురైనట్లు తెలిసిందన్నారు. గొల్లపల్లికి చెందిన పొట్లూరి గోపాలకృష్ణ, పంతం కామరాజు సుమారు 80 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినట్లు గ్రామ రెవెన్యూ అధికారి చెప్పారని వివరించారు. వారిద్దరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. -
సమన్వయ లోపం.. కబ్జాల రాజ్యం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : పోలీసు శాఖ నిర్లక్ష్యం, రెవెన్యూ శాఖ మెతక వైఖరి కారణంగా శంకర్పల్లి మండలంలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ప్రభుత్వ భూముల్లో దర్జాగా పాగావేస్తున్న ఆక్రమణదారులు.. చర్యలకు వచ్చిన అధికారులపై ఏకంగా ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ పరిస్థితిపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టనట్లు వ్యవహరించడంతో మండల పరిధిలో ఇలాంటి ఆక్రమణలు రోజుకొకటి పుట్టుకొస్తున్నాయి. గత వారం మండలంలోని దొంతన్‌పల్లి గ్రామం సర్వేనంబర్ 197లోని ఎకరా ప్రభుత్వ భూమిని స్థానికుడు ఆక్రమించి వరిపంట సాగుచేశాడు. దీంతో రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన అనంతరం భూమిని తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. సదరు ఆక్రమణదారుడి సంబంధీకులు రెవెన్యూ అధికారిపై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చే యగా.. మూడు రోజుల తర్వాత కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో తీవ్రజాప్యం చేయడం గమనార్హం. ఇదేమి సమన్వయం..! రాజధానికి అత్యంత చేరువలో శంకర్పల్లి మండలం ఉండడం, భూముల విలువ ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఆక్రమణలు కూడా పెద్దఎత్తున జరుగుతున్నాయి. అయితే ఈ ఆక్రమణలు రెవెన్యూ అధికారుల దృష్టికి రావడం.. వాటిపై చర్యలకు దిగుతున్నప్పటికీ ఎదురుదాడి జరగడంతో చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడంలేదు. ఈ పరిస్థితిని అదనుగా చేసుకుని మరోవైపు ఆక్రమణల పరంపర జోరుగా సాగుతోంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు ఎల్వర్తి గ్రామంలో సర్వే నంబర్ 160లో అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తి రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి మొక్కజొన్న వేశాడు. అయితే ఆక్రమణపై స్థానిక అధికారులు చర్యలకు ఉపక్రమించగా స్థానికులతో కలిసి పెద్ద రాద్దాంతం చేయడంతో అధికారులు వెనక్కితగ్గారు. సింగాపూర్ గ్రామంలో సర్వేనంబర్ 249లో సీలింగ్ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అయితే ఈ నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు ప్రయత్నించగా స్థానిక నేత రంగంలోకి దిగి ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి తేవడంతో రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరుగుముఖం పట్టారు. సింగాపూర్ గ్రామంలోని ఓ వాగులో స్థానికుడొకరు ఆక్రమణ చేశాడు. వాగు నీటిని అక్రమంగా తన పొలం వైపు మళ్లించేందుకు పెద్దఎత్తున మట్టితో పూడ్చివేశాడు. ఈ అంశంపై రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యం. {పొద్దుటూరులో అక్రమంగా ఇసుక తరలింపు విషయంలో రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. అదేవిధంగా ఈ గ్రామంలో రెండు వెంచర్లపైనా కేసులు నమోదు చేసినప్పటికీ ఫలితం లేదు. శంకర్‌పల్లిలోని 196 సర్వే నంబర్లో అక్రమ వెంచర్‌పై చర్యలకు రెవెన్యూ అధికారులు ఉపక్రమించారు. అయితే వెంచర్ యాజమాన్యం రెవెన్యూ అధికారులపై ఎదురుదాడికి దిగడంతో చర్యలు నిలిపేశారు. ఈ విషయంలోనూ పోలీసులు మెతకవైఖరి అవలంబిస్తున్నారని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. పై అధికారుల వద్దకు పంచాయితీ.. మండలంలో అక్రమార్కుల ఆగడాలపై రెండ్రోజుల క్రితం కలెక్టర్ బి.శ్రీధర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు. మరోవైపు రెవెన్యూ అధికారులు కూడా పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. రెవెన్యూ సిబ్బందిపై దాడులు, కే సు నమోదులో జరుగుతున్న జాప్యంపై కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా వివరించినట్లు మండల తహసీల్దార్ వసంతకుమారి ‘సాక్షి’తో పేర్కొన్నారు.


