టీడీపీ నేత మద్యం దుకాణం సీజ్‌ | TDP leaders liquor shop seized: Andhra pradesh | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత మద్యం దుకాణం సీజ్‌

Oct 5 2025 2:43 AM | Updated on Oct 5 2025 2:43 AM

TDP leaders liquor shop seized: Andhra pradesh

పెద్దతిప్పసముద్రం: ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై శుక్రవారం పోలీసులు జరిపిన దాడుల్లో మండలానికి చెందిన టీడీపీ కీలక నేత కట్టా సురేంద్రనాయుడు సహా మరికొందరు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ జోగేంద్ర, సీఐ మల్లయ్య బృందం శనివారం అన్నమయ్య జిల్లా టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లి సమీపంలో కట్టా సురేంద్రనాయుడు ‘ఆంధ్రవైన్స్‌’ పేరుతో నిర్వహిస్తున్న మద్యం దుకాణంలో ఉన్న బాటిళ్లకు పంచనామా నిర్వహించి వైన్‌షాపు లైసె­న్స్‌ను సీజ్‌ చేసి సీలు వేశారు.

ఎక్సై­జ్‌ పోలీసులు బృందంగా ఏర్పడి మఫ్టీలో కల్తీ మద్యం రవాణా, నిల్వలపై మండలంలో నిఘా వేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు పుట్టగొడుగుల్లా వెలసిన బెల్ట్‌షాపుల్లో దర్జాగా మద్యం విక్రయాలు చేపట్టే­వారు. కల్తీ మద్యం రాకెట్‌ గుట్టు రట్టు కావడంతో బెల్ట్‌షా­పులు నిర్వహిస్తున్న గ్రామస్థాయి కూటమి కార్యక­ర్తల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు ఆకస్మికంగా తని­ఖీలు నిర్వహించి కల్తీ మద్యంతో పట్టుబడితే ఎక్క­డ కేసుల్లో ఇరుక్కుపోతామోనని భావించి బెల్ట్‌­షాపులను మూసేసి పరిచయస్తులకు మాత్రమే చాటుగా మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement