రెచ్చగొట్టి.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు

TDP Leaders High Drama At Kopparru Guntur District - Sakshi

పెదనందిపాడు మండలం కొప్పర్రు గణేష్‌ నిమజ్జన వేడుకల్లో తమ్ముళ్ల రచ్చ

కాపుగాసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ఊరేగింపుపై దాడి 

రణరంగంగా మారిన కొప్పర్రు 

పెదనందిపాడు ఎస్‌ఐకూ గాయాలు

టీడీపీ నేతల హైడ్రామా

పెదనందిపాడు (ప్రత్తిపాడు): గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రులో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లు రువ్వి దాడికి పాల్పడటంతో గ్రామం రణరంగంలా మారింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో ఈ నెల 18న వైఎస్సార్‌సీపీ శ్రేణులు గణేష్‌ నిమజ్జనం నిర్వహించేందుకు సిద్ధం కాగా.. అదే రోజు టీడీపీ శ్రేణులు నిమజ్జనానికి ఏర్పాట్లు చేశాయి. గతంలో గ్రామంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో రెండు నిమజ్జనాలూ ఒకే రోజు నిర్వహిస్తే అల్లర్లు జరిగే ప్ర మాదం ఉందని భావించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు శనివారం జరగాల్సిన నిమజ్జన కార్యక్రమాన్ని ఆది వారానికి వాయిదా వేసుకున్నాయి. 19వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఫలితాలు వెలువడటం, 144 సెక్షన్‌ అమల్లో ఉండటంతో నిమజ్జనం కార్యక్రమాన్ని సోమవారం రాత్రి నిర్వహించాయి.

ఊరేగింపులో భాగంగా వినాయకుడి ప్రతిమ ఉన్న వాహనం గ్రామంలోని మాజీ జెడ్పీటీసీ, టీడీపీ నేత బత్తిన శారద ఇంటి వద్దకు చేరుకుంది. అప్పటికే అ క్కడ కాపుకాసిన సుమారు వందమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆ వాహనానికి ఎదురుగా వచ్చి పార్టీ జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వివాదాలకు దూరంగా కార్యక్రమాన్ని ముగించుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ ముఖ్యనేత ఇంటూరి హనుమంతరావుపై అక స్మాత్తుగా విరుచుకుపడ్డారు. ముందుగా సిద్ధం చేసుకున్న రాళ్లు, సీసాలతో వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. దీంతో హనుమంతరావు కుమారుడు శ్రీకాంత్‌ మా నాన్నపై ఎందుకు దాడి చేశారంటూ మాజీ జెడ్పీటీసీ ఇంటికి వెళ్లి ప్రశ్నించాడు. దీంతో శ్రీకాంత్‌ను బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి గదిలో పెట్టి తలుపులు బిగించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు అతనిపై మూకుమ్మడిగా దాడి చేశారు. కొంతసేపటికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసుల సాయంతో మాజీ జెడ్పీటీసీ ఇంటి గది తలుపులు పగులగొట్టి శ్రీకాంత్‌ను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

బతకడేమోనని.. కుట్ర పన్ని..
అపస్మాకర స్థితిలో ఉన్న శ్రీకాంత్‌ ప్రాణాలకు ఏమైనా జరిగితే నేరం తమపై పడుతుందన్న ఉద్దేశంతో టీడీపీ శ్రేణులే జెడ్పీటీసీ ఇంటిని ధ్వంసం చేసి సో ఫాలకు నిప్పు పెట్టారని, మోటార్‌ సైకిళ్లను సైతం తగలబెట్టుకున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరో పిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ, టీడీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో ఊరుఊరంతా రణరంగంలా మారింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో పెదనందిపాడు ఎస్‌ఐ కె.నాగేంద్రరావుతోపాటు వైఎస్సార్‌సీపీకి చెందిన మేదరమెట్ల వేణు, వెంకటప్పయ్య చౌదరి, ఇంటూరి హనుమంతరావు, యేలూరి పిచ్చయ్య, మేదరమెట్ల వెంకటనారాయణ, కందిపాటి సాంబ శివరావు, షేక్‌ సుభానీకి తీవ్ర గాయాలయ్యాయి. 

పాత గొడవలు.. వర్గపోరే కారణం
గ్రామంలో అల్లర్లు చెలరేగడానికి పాత గొడవలు, వర్గపోరు కారణంగా తెలుస్తోంది. ఏటా వినాయక చవితి ఉత్సవాలు మొదలు నిమజ్జన వేడుకలు ముగిసే వరకు ఈ గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతుంటాయి. గ్రామం నుంచి పోటీ చేసిన టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఓడిపోవ డాన్ని జీర్ణించుకోలేక రెచ్చగొట్టి అల్లర్లకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

టీడీపీ నేతల హైడ్రామా
కాగా.. టీడీపీ మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, మాకినేని పెదరత్తయ్య, నాయకులు తెనాలి శ్రావణ్‌కుమార్, ధూళిపాళ్ల నరేంద్ర పరామర్శ పేరుతో మంగళవారం కొప్పర్రులో పర్యటించారు. మాజీ జెడ్పీటీసీ శారద కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top