వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు | TDP Leader Arrested In Prostitution Case | Sakshi
Sakshi News home page

వ్యభిచారం కేసులో టీడీపీ నేత అరెస్టు

Nov 22 2021 4:42 AM | Updated on Nov 22 2021 4:42 AM

TDP Leader Arrested In Prostitution Case - Sakshi

తాడికొండ: వ్యభిచారం కేసులో టీడీపీ నేత, అమరావతి దళిత జేఏసీ నేత చిలకా బసవయ్యను ఆదివారం గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. రాయపూడి – మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య ఓ రేకుల షెడ్డులో తుళ్లూరుకు చెందిన ఓ యువతితో రాసలీలలు సాగిస్తుండగా పోలీసులు  పట్టుకున్నారు. దళిత జేఏసీ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తూ మహిళలను లొంగదీసుకుంటున్నాడనే ఆరోపణలు బసవయ్యపై ఉన్నాయి. యువతితో రాసలీలల్లో ఉండగా వీరికి కాపలాగా ఉన్న రామచంద్రవర్మ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   
 
 

Advertisement
 
Advertisement
Advertisement