
ఏలూరు: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓవరాక్షన్ చేశారు. రోడ్డుపై బైఠాయించి తననే అడ్డుకుంటారా అంటూ కొత్త డ్రామాకు తెరతీశారు. జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబుకు అడుగడుగునా నిరసన సెగ తగలడంతో కొత్త నాటకాన్ని ప్లే చేయబోయారు. పోలవరాన్ని పరిశీలిస్తానంటూ బాబు హడావిడి చేశారు. పోలవరానికి వెళ్లేదారిలో బైఠాయించి పబ్లిసిటీ స్టంట్‌కు తెరలేపారు చంద్రబాబు.యాత్రలో అడుగడుగునా నిరసన సెగలు తగలడం వల్లే కొత్త నాటకాన్ని రక్తికట్టించే యత్నం చేశారు చంద్రబాబు.
కాగా, కొయ్యలగూడెం రోడ్ షోలో చంద్రబాబుకు నిరసన గళమే వినిపించింది. చంద్రబాబు ప్రతిపక్ష కావడం మా కర్మ అంటూ ఫ్లకార్డు ప్రదర్శించారు. మరొకవైపు సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడం మా అదృష్టమంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అక్కడ ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో, వారిని పోలీసులు చెదరగొట్టారు. కాగా, ప్రశాంతంగా ఉన్న మా ప్రాంతంలో మళ్లీ ఉద్రికత్తలు, రెచ్చగొట్టేందుకే చంద్రబాబు యాత్రలు చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు.
ఇది చదవండి: చంద్రబాబుకు మరోసారి నిరసన సెగ..