చంద్రబాబుకు మరోసారి నిరసన సెగ.. ఎక్కడంటే?

Protest Against TDP Chandrababu In Road Show At Eluru District - Sakshi

సాక్షి, ఏలూరు: జిల్లాలోని కొయ్యలగూడెం రోడ్‌ షోలో టీడీపీ అధినేత చంద్రబాబుకు నిరసన సెగ తగిలింది. ఈ సందర్భంగా నిరసనకారులు చంద్రబాబు ప్రతిపక్ష నేత కావడం మాకర్మ అంటూ ఫ్లకార్డులు పట్టుకుని నిరసనలు తెలిపారు. 

ఇదే సమయంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం మా అదృష్టమంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు రెచ్చిపోయారు. అక్కడ ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలపై రాళ్లు రువ్వారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో, వారిని పోలీసులు చెదరగొట్టారు. కాగా, ప్రశాంతంగా ఉన్న మా ప్రాంతంలో మళ్లీ ఉద్రికత్తలు, రెచ్చగొట్టేందుకే చంద్రబాబు యాత్రలు చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు :

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top