‘కూటమి సర్కార్ అరాచకాలకు సుప్రీం తీర్పు చెంపపెట్టు’ | Supreme Verdict Direct Slap Coalition Govt Lawless Rule: Dharmana | Sakshi
Sakshi News home page

‘కూటమి సర్కార్ అరాచకాలకు సుప్రీం తీర్పు చెంపపెట్టు’

Oct 21 2026 5:05 PM | Updated on Oct 21 2026 5:44 PM

Supreme Verdict Direct Slap Coalition Govt Lawless Rule: Dharmana

సాక్షి,శ్రీకాకుళం: రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన జరగడం లేదని, కూటమి సర్కార్ అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హింస చెలరేగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు డీజీపీని,రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలపై ధర్మాన ప్రసాద్‌ రావు స్పందించారు. ‘రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదు. ఎన్నికల సంఘం కూడా స్వేచ్ఛగా పనిచేయని దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసు వ్యవస్థ ఏకపక్షంగా పనిచేయడం దేశద్రోహంతో సమానం. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకునేలా చూడాలని సుప్రీంకోర్టు డీజీపీని నేరుగా ఆదేశించడాన్ని వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తోంది.

రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగుతోందని కోర్టులే స్పష్టంగా గుర్తించాయి. ఈ విధంగా పాలన సాగిస్తున్నవారు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలి. ఇది కేవలం ఎన్నికకు సంబంధించిన అంశం కాదు. రాష్ట్ర సమగ్ర పాలన, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన కీలక విషయం’అని ధర్మాన స్పష్టం చేశారు.

సుప్రీం తీర్పు బాబుకు చెంపపెట్టు

ఇదీ చదవండి : చంద్రబాబు సర్కార్‌పై పిన్నెల్లి ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement