సుప్రీంకోర్టు ఆదేశించినా సరే దౌర్జన్యాలు జరుగుతున్నాయి: బొత్స | botsa satyanarayana on ap local body elections 2026 | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు ఆదేశించినా సరే దౌర్జన్యాలు జరుగుతున్నాయి: బొత్స

Oct 21 2026 5:02 PM | Updated on Oct 21 2026 5:13 PM

botsa satyanarayana on ap local body elections 2026

విశాఖపట్నం: ప్రజాస‍్వామ్యం మీద కూటమికి నమ్మకం లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశించినా సరే దౌర్జన్యాలు జరుగుతున్నాయని తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అని ప్రశ్నించారు.

విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘న్యాయపరంగా పోరాడతాం. ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పోలీసులను చెప్పుచేతల్లో పెట్టుకుని దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. నిష్పక్షపాతంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి. 

కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. పోలీసుల అండతో వెన్నుపోటు పార్టీ గూండాలు రెచ్చిపోతున్నారు. కూటమి నేతల ప్రవర‍్తనపై జాలేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలి. కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’’ అని తెలిపారు.

ఇదీ చదవండి: పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవ​చ్చు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement