సుప్రీంకోర్టు తీర్పు.. ఎస్‌ఈసీ అత్యవసర భేటీ | AP Municipal Polls: SEC Meeting In Wake Of Supreme Court Verdict | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టు తీర్పు.. ఎస్‌ఈసీ అత్యవసర భేటీ

Oct 21 2026 1:25 PM | Updated on Oct 21 2026 1:37 PM

AP Municipal Polls: SEC Meeting In Wake Of Supreme Court Verdict

సాక్షి, విజయవాడ: సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్‌ఈసీ సమావేశమైంది. 19 స్థానాల్లో ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేపట్టింది. ఈ నెల 25 వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఎస్‌ఈసీ అనిల్‌ చంద్ర పునేఠా, సెక్రటరీ మల్లికార్జున, ఐజీ రాజకుమారి భేటీ అయ్యారు. ఆయా స్థానాల్లో జరిగిన ఘటనలు, కేసుల అంశంపై ఎస్‌ఈసీ చర్చ జరుపుతోంది. 

పిడుగురాళ్ల, గురజాల, దర్శి, పుంగనూరు, మైదుకూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, రాయచోటి, దాచేపల్లి, గుత్తి, కడప, రాజంపేట, పులివెందుల, బద్వేల్‌, తిరుపతి, పొద్దుటూరు, కనిగిరి, తాడిపత్రి, జమ్మలమడుగులో గడువు పెంచాలని సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకోవడంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పిటిషనర్ అభ్యర్థనలను ఎస్‌ఈసీ పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

రెండు రోజుల పాటు నామినేషన్ల గడువు పొడిగించిన సుప్రీంకోర్టు.. నామినేషన్లు వేసే అభ్యర్థులకు తగిన పోలీస్ భద్రత కల్పించాలని ఆదేశించింది. జిల్లా కేంద్రంలో నామినేషన్లు వేసుకునే అవకాశం ఇచ్చింది.  ఎన్నికల హింసకి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని.. ఉత్తర్వుల అమలు నివేదిక సుప్రీంకోర్టుకు పంపాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఈ నెల 27కి వాయిదా వేసింది.

స్వేచ్ఛగా, పారదర్శకంగా నామినేషన్లు వేసే వాతావరణం కల్పించాలని లా అండ్ ఆర్డర్ కాపాడాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘పోలీసులు, అధికారులు అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఎన్నికల సంఘం గట్టి పర్యవేక్షణ చేయాలి. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి. ఇది రాజ్యాంగ విధి. నామినేషన్లను అడ్డుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు చూస్తూ కూర్చోలేదు. న్యాయ సమీక్ష అధికారం కింద ఈ వ్యవహారంలో ఈసీకి తగిన ఆదేశాలు ఇస్తున్నాం. స్వేచ్ఛగా ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగ కోర్టులు తగిన ఆదేశాలు ఇస్తాం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇదీ చదవండి: బాబు సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement