చంద్రబాబు సర్కార్‌పై పిన్నెల్లి ఆగ్రహం | Former MLA Pinnelli Ramakrishna Reddy Slams Chandrababu Government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌పై పిన్నెల్లి ఆగ్రహం

Oct 21 2026 3:30 PM | Updated on Oct 21 2026 4:26 PM

Former MLA Pinnelli Ramakrishna Reddy Slams Chandrababu Government

సాక్షి,పల్నాడు: చంద్రబాబు సర్కార్‌, పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కనీసం మహిళలని కూడా చూడకుండా వారిపై దాడులకు తెగబడుతున్నారని ధ్వజమెత్తారు.  

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బంది పెడుతున్నారని పిన్నెల్లి  అన్నారు. ఈ అక్రమాలను నిరసిస్తూ ఆయన పల్నాడు జిల్లా రొంపిచర్లలో అనుచరులతో కలిసి రోడ్డుపై బైఠాయించి పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తూ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తమను వేధిస్తున్న అధికారులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

దమ్ముంటే రండి... పోలీసులను అడ్డంపెట్టుకుని ఆడంగి రాజకీయాలు ఎందుకు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement