ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే..

Special Story In Valentines Day 2023 - Sakshi

కులము.. గిలము.. బలము చూసి..  వయసు.. వరస.. సొగసూ చూసి.. పుట్టుకొస్తాదా ప్రేమ..? మనసుకు మనసుకు వంతెనేసి.. తనువూ.. తనువూ మెలికలేసే తీరేరా ప్రేమ.. కవి చెప్పినట్లుగానే... ఆకాశమంతా.. ఆనందమై.. తెల్లారుతోంది ప్రేమికుల కోసమే.. ఆలోచనంతా ఆరాటమై.. అన్వేస్తోంది ఈరోజు కోసమేనంటున్నారు వైజాగ్‌ ప్రేమికులు   

సాక్షి, విశాఖపట్నం : నగరమంతా వాలంటైన్‌ ఫీవర్‌తో గులాబీలా విరుచుకుంది. జంట హృదయాలు వలపు సంబరాలు చేసుకుంటుంటే.. ఆ గుండెకు హత్తుకునేలా బహుమతులిచ్చిపుచ్చుకునే సందడితో వ్యాపారులు కూడా వాలెంటైన్‌ సంబరాలు చేసుకుంటున్నారు. 

లవ్‌ వైజాగ్‌లో... లవ్‌ యూ డార్లింగ్‌.. 
ప్రేమకు ప్రాంతం లేదు.. కులం లేదు.. మతం లేదు.. భాష లేదు, భావం లేదు. ప్రేమ అందరి హృదయాల్ని కొల్లగొట్టేసింది. విశాఖ యువతరం కూడా ప్రేమ వానలో తడిసి ముద్దయిపోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఫిబ్రవరి 14 కోసం ఎదురుచూస్తూ తమకు నచ్చిన వారికి ముచ్చటైన బహుమతులు కొని ఇంప్రెస్‌ చెయ్యాలని రాత్రంతా అన్వేస్తోందినే ఉన్నారు. పార్కులు, బీచ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇలా అన్ని చోట్లా జంట గువ్వలు గుసగుసలాడుకుంటూనే ఉంటాయి. తొలినాళ్లలో ప్రేమంటే మాటల ద్వారా వ్యక్తపరిచేది. ఆ తర్వాత ప్రేమలేఖలు.. ఆపై రోజా పూలు.. ఆ తర్వాత గ్రీటింగ్‌ కార్డులు.. ఇలా.. తరం మారుతున్న కొద్దీ లవ్‌ రిచ్‌గా మారిపోయింది. అదేమని అడిగితే.. హలో గురూ.. ప్రేమ కోసమే కదా అని జోష్‌తో చెబుతున్నారు ఈ తరం యూత్‌. మరి ఈ రోజున లవ్‌ వైజాగ్‌.. లవర్స్‌ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా..? అక్షరాలా రూ.20 కోట్ల రూపాయలు. తన కోసం ఎదురు చూసే ప్రేమ గుండెకు ఇచ్చే బహుమతిలోనే కొండంత ప్రేమ కనిపించాలని లవర్స్‌ ఉవ్విళ్లూరుతుంటారు. అందుకే.. విశాఖ యువత గిఫ్ట్‌ కోసం బోలెడు ఖర్చు చేస్తున్నారు. 

► గతేడాది ప్రేమికుల రోజున నగరంలో రూ.15 కోట్ల వరకూ బహుమతులు కొన్నారని అంచనా.  

► ఈ ఏడాది సుమారు రూ.20 కోట్ల వరకూ అమ్మకాలు పెరుగుతాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వాలంటైన్‌ వీక్‌ పేరుతో దాదాపు రూ.10 కోట్ల అమ్మకాలు జరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. 

► ప్రేమికుల రోజున మన నగరంలో రూ.2 కోట్ల రూపాయల గులాబీ పూలు అమ్ముడవుతాయని పూల వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా రెడ్, పింక్‌ గులాబీలే ఎక్కువగా అమ్ముడవుతాయంట. 

► వ్యాపారులు గిఫ్ట్‌లకు 20 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్‌ ఆఫర్లిచ్చి ఆకర్షిస్తున్నారు. 

► రెస్టారెంట్స్, హోటల్స్‌ వాలెంటైన్స్‌ కోసం స్పెషల్‌ టేబుల్స్‌ రిజర్వ్‌ చేశాయి. బీచ్‌రోడ్డులోని కొన్ని హోటల్స్‌.. ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి.  

► దాదాపు అన్ని జ్యుయలరీ షాపులు.. వాలెంటైన్‌ స్పెషల్‌ జ్యుయలరీ స్పెషల్‌ డిస్కౌంట్‌తో అందిస్తున్నాయి. 

► ఫిబ్రవరి 14 కోసం మలీ్టప్లెక్స్‌లలో అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్లు అమ్మకాలు జరగ్గా అందులో కపుల్‌ టికెట్స్‌ దాదాపు 50 శాతం ఉండటం విశేషం. 

► భీమిలి సమీపంలోని ఓ హోటల్‌లో 50 టేబుల్స్‌ లవ్‌ స్పాట్‌లుగా అడ్వాన్స్‌ బుకింగ్‌ పెట్టినట్లు ప్రకటించిన 24 గంటల్లోనే అన్నీ బుక్‌ అయ్యాయంట.

సోషల్‌ మీడియాలో లవ్‌ వాన 
విశ్వజనీయమైన ప్రేమ.. సోషల్‌ మీడియానూ లవ్‌ వానలో ముంచెత్తేలా చేస్తోంది. వారం రోజుల క్రితం మొదలైన ప్రేమికుల వారోత్సవాలప్పుడు ప్రారంభమైన లవ్‌ పోస్ట్‌లు.. చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. హార్ట్‌బీట్‌ సింబల్స్, కవితలు, గ్రీటింగ్‌ కార్డులు, ప్రేమ చిహా్నలు, గిఫ్ట్‌లు.. ఇలా ఎన్నో రకాలైన సింబల్స్, స్టిక్కర్లు, ఫొటోలు, కొటేషన్లతో ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, టెలిగ్రామ్, మెసెంజర్‌.. ఇలా.. అన్నీ బిజీ బిజీగా మారిపోయాయి.  

పెళ్లికి కాస్త ఆలోచిస్తున్నాం
నిండా లవ్‌లో మునిగిన వారికి కూడా ఈ ప్రేమ నిర్వచనం సంగతి ఓ పట్టాన అంతుచిక్కదు. అందుకే ప్రేమకు అర్థం వెతికేందుకు నగరంలో దాదాపు 100 మంది యువతీ యువకులతో మాట్లాడగా.. చాలా మంది యువత కొత్త కొత్త అర్థాలు చెప్పారు. ఈ సమాధానాల్లోనే.. చాలా మంది వీర ప్రేమికులు, భగ్న ప్రేమికులు, టైంపాస్‌ బఠానీలు, వన్‌సైడ్‌ లవర్స్‌ కనిపించారు.ఆ సమాధానాల సంగతేంటో మీరు చదవండి... 

♦ప్రేమంటే రెండు జీవితాలు, రెండు హృదయాలు, రెండు కుటుంబాలు : 35 మంది  
♦పెళ్లి చేసుకోడానికి వేసే మొదటి అడుగు :  15 మంది. 
♦కాలేజీలో ఒంటరి జీవితానికి తుంటరి తోడు : 10 మంది 
♦జీవితం బోర్‌ కొట్టకుండా టైంపాస్‌ చేసుకునేది : 25 మంది  
♦ప్రేమంటే సెక్స్‌ : 4 
♦వన్‌సైడ్‌ లవర్‌ని, నాకు అంతు చిక్కడంలేదు: 11 మంది 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top