తిరుమల: 44 నిమిషాల్లోనే 2.20 లక్షల టికెట్లు ఖాళీ

Special and Vaikunta Ekadashi Darshan Tickets released Online by TTD - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వార దర్శన టికెట్లను శనివారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. జనవరి 1 నుంచి 11వ తేదీ వరకు 2 లక్షల 20వేల టిక్లెను అందుబాటులో ఉంచారు.

టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లోనే దర్శన టికెట్లను కొనుగోలు చేయాలని భక్తులకు సూచించింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 3న ద్వాదశి పురష్కరించుకొని పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేశారు.

44 నిమిషాల్లోనే..
వైకుంఠ ద్వార దర్శన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో విడుదలైన 44 నిమిషాల్లోనే టికెట్లు అయిపోయాయి. 10 రోజులకు గానూ 2.20 లక్షల టికెట్లను టీటీడీ విడుదల చేసింది. 

చదవండి: (ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే మన టీకాల సత్తా ఎంత?)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top