మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన తనయుడు | Son assassinated mother for not giving money for alcohol | Sakshi
Sakshi News home page

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసిన తనయుడు

Aug 9 2025 5:58 AM | Updated on Aug 9 2025 5:58 AM

Son assassinated mother for not giving money for alcohol

కర్నూలు:  మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేసి­న ఘటన కర్నూలులో సంచలనం రేపింది. పోలీసుల కథనం మేరకు.. బుధవారపేటలోని కనకదుర్గమ్మ దేవాలయం సమీపంలో రుద్రాక్ష ఎల్లమ్మ(70), కుమారుడు జమ్మన్న నివాసముంటున్నారు. జమ్మన్న వంట మాస్టర్‌­గా పనిచేస్తూ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని గురువారం రాత్రి తల్లిని వేధించాడు. 

ఆమె ఇవ్వకపోవడంతో తెల్లవారుజామున ఒంటరిగా పడుకుని ఉన్న తల్లి చెవి కమ్మలను బలవంతంగా లాక్కొన్నాడు. అనంతరం ముక్కు మూసి హత్య చేసి పరారయ్యా­డు. శుక్రవారం ఉదయం పోలీసులకు  సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకొని చేరుకుని హత్య జరిగిన తీరును పరిశీలించారు. జమ్మన్న కూ­తురు జ్ఞానేశ్వరి ఇచి్చన ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు న­మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement