రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది: సోము వీర్రాజు

Somu Veerraju Talks In Press Meet Over Amaravati Lands Insider Trading - Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు బాత్‌రూమ్‌లను కూడా వదలకుండా అవినీతికి పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాటు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రెడింగ్‌ జరిగిందని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి రాజధాని నిర్మాణంలో దాదాపు 7200 కోట్ల రూపాయల పనుల్లో అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా చదరపు అడుగుకు 8 నుంచి 12 వేల వరకు ఖర్చు చేశారన్నారు.

నీరు, చెట్టు పోలవరం, ఉపాధిహామీ, స్వచ్ఛ భారత్‌ పనుల్లో టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని పేర్కొన్నారు. టీడీపీ హాయంలో జరిగిన అవినీతి మొత్తంపై విచారణ జరపాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రశ్నించారని, ఆయన చంద్రబాబు అవినీతిని ఏటీఎంతో పోల్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. టీడీపీపై చేసిన అవినీతి ఆరోపణలకు తాము ఇప్పటికి కట్టుబడి ఉన్నామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. (రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top