కేటీఆర్‌కు మంత్రి అప్పలరాజు సవాల్‌.. ‘40 బస్సులు వేసుకొని రండి’

Seediri Appalaraju Challenges KTR Over AP Development - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో మౌలిక వసతులు సరిగా లేవంటూ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపాయి. కేటీఆర్‌ వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తీవ్రంగా ఖండించారు. మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్‌ అలా మాట్లాడి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. తాజాగా కేటీఆర్‌ అనుచిత వ్యాఖ్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించారు. బాధ్యత కలిగిన వ్యక్తులు ఇలా మాట్లాడటం బాధాకరమన్నారు. ఏపీకి నాలుగు బస్సులు కాదు. జిల్లాకు 40 బస్సులు వేసుకురండని సవాల్‌ విసిరారు.
చదవండి: AP Minister: కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న మంచిని చూసి తెలంగాణలో కూడా చేద్ధామని కేసీఆర్‌ కూడా చెప్పారు, ఈ విషయం మీకు గుర్తులేదా అని ప్రశ్నించారు. ‘ఏపీలో చేపడుతున్న నాడు-నేడు కార్యక్రమం స్పూర్తితోనే తెలంగాణలో అమలు చేస్తున్నారు. ఏపీ మాదిరిగానే ఇంగ్లీష్ మీడియం తెలంగాణలో ప్రవేశపెడుతున్నారు. ఈ విషయం మీకు తెలియలేదా? నీతి ఆయోగ్ ఇచ్చిన వార్షిక నివేదికలో ఏపీది 3వ స్థానం .ఈ విషయం మీకు తెలుసా? ఎవరో ఫ్రెండ్ చెబితే ఏపీని తక్కువ చేసి మాట్లాడతారా? హైదరాబాద్ లేని తెలంగాణను మీరు ఓ సారి ఊహించుకోండి.
చదవండి: హైదరాబాద్‌లోనే కరెంట్‌ లేదు: కేటీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్‌

హైదరాబాద్ అభివృద్ధిలో మీ పాత్ర, మీ నాన్నగారి పాత్రేంటో చెప్పండి. మీ ఎనిమిదేళ్ల పాలనలో హైదరాబాద్‌లో తెచ్చిన మార్పులేంటి. మీ తెలంగాణలో విద్యుత్ కోతలు లేవా. మొన్నటికి మొన్న విద్యుత్ కోతలపై రైతులు ధర్నా చేయలేదా. ఏపీకి రండి ఎన్నివేల కోట్లతో రోడ్లు వేసుకోగలిగామో చూపిస్తాం.రోడ్ల కోసం ఈ మూడేళ్లలో మీరెంత ఖర్చుచేశారో...మేమెంత ఖర్చు పెట్టామో ఓపెన్ డిబేట్‌కు రండి. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించాలని పనిచేస్తున్న ప్రభుత్వం మాది.
చదవండి: ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నా.. కేటీఆర్‌కు మంత్రి రోజా కౌంటర్‌

తెలంగాణ గొప్పదనమేంటో కోవిడ్ సమయంలోనే తేలిపోయింది. మిగులు బడ్జెట్ ఉండి కూడా కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకోవడం మీకు సాధ్యపడిందా. తెలంగాణ నుంచి ప్రజలు ఏపీకి ట్రీట్ మెంట్ కోసం వచ్చారు. కోవిడ్ సమయంలో దేశం మొత్తం వైఎస్‌ జగన్‌ పేరు స్మరించుకుంది. గౌరవమైన పదవుల్లో ఉన్న వారు మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. టీడీపీ నేతలకు బుర్రాబుద్దీ ఉందా. కేటీఆర్ పనిలేక మాట్లాడాడు. టీడీపీ నేతల ఆత్మగౌరవం చచ్చిందా. కేటీఆర్ తానా అంటే తందానా అనడానికి టీడీపీ నేతలకు సిగ్గులేదా’ అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు.
చదవండి: ‘కేటీఆర్‌.. ఏపీకి రండి.. అభివృద్ధి చూపిస్తాం’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top