AP: Minister Peddireddy Ramachandra Reddy Responding on KTR Comments - Sakshi
Sakshi News home page

AP Minister: కేటీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి

Apr 29 2022 3:00 PM | Updated on Apr 29 2022 3:43 PM

Minister Peddireddy Ramachandra Reddy Responding on KTR Comments - Sakshi

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'ఏపీలో విద్యుత్‌ కోతలు లేవు. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లు బాగుపడ్డాయి. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్‌ అలా మాట్లాడి ఉండొచ్చు. ఏపీలో పరిస్థితి బాగాలేదు.. తెలంగాణలో అంతా బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్‌ భావించారేమోనని' మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.

చదవండి: (ఏపీకి పెండింగ్‌ బకాయిలు చెల్లించండి: సుప్రీంకోర్టు)

Advertisement
 
Advertisement
Advertisement