Schools & Colleges Reopen Date in Andhra Pradesh After Lock Down | 2020, Corona News in Telugu - Sakshi
Sakshi News home page

నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు‌, కాలేజీలు ప్రారంభం

Oct 29 2020 2:18 PM | Updated on Oct 29 2020 4:15 PM

Scheduled Release For Schools And Colleges In AP - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : కరోనా వైరస్‌ కారణంగా మూతపడ్డ పాఠశాలలు, కాలేజీలు నవంబర్‌ 2 నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను వివరించారు.

  • నవంబర్‌ 2 నుంచి పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్నాయి. 
  • నవంబర్‌ 2 నుంచి 9,10,11/ ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం ,12 / ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు నడపనున్నారు. హాఫ్‌డే మాత్రం నిర్వహిస్తారు. 
  • హయ్యర్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అన్ని కాలేజీలకూ కూడా నవంబర్‌ 2నుంచే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులను నిర్వహిస్తారు. 
  • నవంబర్‌ 23 నుంచి 6,7,8  క్లాసులకు బోధన ప్రారంభం అవుతుంది. రోజు విడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. 
  • డిసెంబర్‌ 14 నుంచి 1,2,3,4,5 తరగతులను ప్రారంభిస్తారు. రోజువిడిచి రోజు, హాఫ్‌ డే పాటు క్లాసులు నిర్వహిస్తారు. 

అన్ని ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలకు అన్నింటికీ కూడా ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement