దళితులకు సీఎం జగన్‌ ఆశయాలు ఊపిరి

SC Gazetted‌ Officers Association Says CM Jagan Developing Education To Scheduled Castes - Sakshi

ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంఘం 

సాక్షి, అమరావతి: దళిత వర్గాల విద్యాభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్‌ అధికారుల సంక్షేమ సంఘం ప్రశంసించింది. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్‌  ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాడు–నేడు, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన, ఆంగ్ల విద్యా బోధన లాంటి  పథకాలు బడుగులకు చేయూతనిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టి, ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా తయారు చేయాలన్న ఆయన సంకల్పానికి తమ సంఘం అండగా నిలుస్తుందని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top