సెలవు తీసుకున్న సాగర రక్షకి | Savitribai Phule Coast Guard Ship Service Journey Ends: andhra pradesh | Sakshi
Sakshi News home page

సెలవు తీసుకున్న సాగర రక్షకి

Sep 21 2026 4:57 AM | Updated on Sep 21 2026 4:58 AM

Savitribai Phule Coast Guard Ship Service Journey Ends: andhra pradesh

ముంబైలో జరిగిన బోటు ప్రమాదంలో సహాయక చర్యలు చేపడుతున్న ఫూలే షిప్‌ (ఫైల్‌)

 ముగిసిన సావిత్రీబాయి ఫూలే కోస్ట్‌గార్డ్‌ షిప్‌ ప్రస్థానం 

2006లో కోస్ట్‌గార్డ్‌లో చేరిన ఫూలే షిప్‌ 

విశాఖ కేంద్రంగా విలక్షణ సేవలందించిన సరోజినీ నాయుడు క్లాస్‌ వెసల్‌ 

కార్వార్‌లో డీకమిషనింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించిన కోస్ట్‌గార్డ్‌ దళాలు

సాక్షి, విశాఖపట్నం: రెండు దశాబ్దాల పాటు భారత సముద్ర జలాలకు రక్షణ కవచంగా నిలిచిన ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ షిప్‌ ఐసీజీఎస్‌ సావిత్రీబాయి ఫూలే సుదీర్ఘ ప్రస్థానం లాంఛనంగా ముగిసింది. కర్ణాటకలోని కార్వార్‌ పోర్టులో డీ–కమిషనింగ్‌ వేడుకలను కోస్ట్‌గార్డ్‌ దళాలు ఆదివారం ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో కమాండింగ్‌ ఆఫీసర్‌ గౌరవ్‌ శ్రీవాస్తవ జాతీయ జెండాను, కోస్ట్‌గార్డ్‌ పతాకాన్ని అవనతం చేసి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) ప్రవీణ్‌కుమార్‌ మిశ్రాకు అందజేయడంతో ఈ నౌక సేవలకు అధికారికంగా ముగింపు పలికారు. 

2006 నుంచి అలుపెరగని ప్రయాణం 
గోవా షిప్‌యార్డ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ నౌక సరోజినీ నాయుడు క్లాస్‌ ఫాస్ట్‌ పెట్రోల్‌ వెసల్‌గా నిర్మితమైంది. 2006 అక్టోబర్‌ 28న ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ అమ్ముల పొదిలో చేరింది. 270 టన్నుల బరువుతో, గరిష్టంగా 35 నాటికల్‌ మైళ్ల వేగంతో ప్రయాణించి శత్రువుల కదలికలను దీటుగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. సరోజినీ నాయుడు క్లాస్‌ షిప్స్‌ కింద మొత్తం 9 షిప్స్‌ని నిర్మించగా.. ఇందులో ఏడింటికి స్వాతంత్య్ర సమరయోధులు, సామాజిక సంఘ 
సంస్కర్తల పేర్లని పెట్టారు.

 ఇందులో 235వ నంబర్‌తో తయారు చేసిన షిప్‌కు మహిళా సాధికారత, విద్యాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన 19వ శతాబ్దపు ప్రముఖ సామాజిక సంఘసంస్కర్త సావిత్రీబాయి ఫూలే సేవలకు గుర్తుగా కోస్ట్‌గార్డు అధికారులు ఈ నౌకకు ఆమె పేరును పెట్టారు. ఆ పేరుకు సార్థకత చేకూరుస్తూ గడచిన 20 ఏళ్లలో తీరప్రాంత భద్రతలో ఈ నౌక తనదైన ముద్ర వేసింది. విశాఖ కేంద్రంగా కొన్నాళ్లు, మంగళూరు కేంద్రంగా మరికొన్ని సంవత్సరాలు సేవలందించింది.

14 ఆపరేషన్లలో సక్సెస్‌ 
మంగళూరు హోమ్‌పోర్టుగా ఉన్నప్పటికీ.. ఈ సరోజినీ నాయుడు క్లాస్‌ వెసల్‌  విశాఖపట్నం కేంద్రంగా కూడా విలక్షణమైన సేవలందించింది. ప్రత్యేక ఆరి్థక మండలి నిఘా, స్మగ్లింగ్‌ అరికట్టడం, మాదక ద్రవ్యాల రవాణాను గుర్తించడం వంటి కీలక మిషన్లలో తన ఆపరేషనల్‌æ నైపుణ్యాన్ని ప్రదర్శించి సముద్ర జలాల రక్షణలో సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. 

కేవలం భద్రతా విధులే కాకుండా విపత్కర వాతావరణ పరిస్థితుల్లో నడిసంద్రంలో ఆపదలో చిక్కుకున్న మత్స్యకారులు, వాణిజ్య నౌకల సిబ్బందికి సావిత్రీబాయి ఫూలే షిప్‌ ప్రాణదాతగా నిలిచింది. తన సర్వీసులో 14 కీలకమైన సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఆపరేషన్లు, 4 మెడికల్‌ ఎవాక్యుయేషన్‌ మిషన్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఆపదలో ఉన్న 71 మంది ప్రాణాలను రక్షించి తీరప్రాంత భద్రతా దళాల చరిత్రలో ఎనలేని కీర్తిని గడించిన ఫూలే షిప్‌ సేవల నుంచి ని్రష్కమించినట్టు కోస్ట్‌గార్డ్‌ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement