నరసాపురం రూరల్: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలవడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. మండలంలోని తూర్పుతాళ్లు సర్పంచ్ పదవి జనరల్ కావడంతో పోటీ పెరిగింది. రాత్రి వేళ గ్రామ దేవత సమక్షంలో గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీ పెద్దల ఆధ్వర్యంలో సర్పంచ్ పదవికి వేలం పాట నిర్వహించారు. ఓ అభ్యర్థి రూ.50 లక్షలు ఇస్తానని.. మరో అభ్యర్థి ఎకరా భూమి గ్రామ దేవత పేరున రాస్తానని.. ఇంకొకరు గుడి కట్టిస్తానంటూ చెప్పారు.
అయితే నిబంధనల మేరకు అభ్యర్థులు నడుచుకోవాలని, షరతులు వర్తిస్తాయని గ్రామ పెద్దలు చెప్ప డం గమనార్హం. నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీన మరోసారి సమావేశం నిర్వహించుకుని వేలం ఖరారు చేద్దామని నిర్ణయించడం కొసమెరుపు. ఏ కగ్రీవాల పేరుతో ఇలా బలవంతపు వేలం పాటలు నిర్వహించడం తగదని ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయ పడుతున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేలా చూడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.
-పశ్చిమగోదావరి
ఇదీ చదవండి: రెండు శాతం ఓట్ల పార్టీకి చైర్‌పర్సన్ పీఠమా?


