భక్తులకు కనువిందు.. జలాధివాసం వీడిన సంగమేశ్వరుడు | Submerged Sangameswara Temple Is Emerging From The Krishna Waters At Nandyal District | Sakshi
Sakshi News home page

భక్తులకు కనువిందు.. జలాధివాసం వీడిన సంగమేశ్వరుడు

Dec 2 2024 8:22 AM | Updated on Dec 2 2024 9:42 AM

Sangameswara Temple Nandyal District

ప్రాచీన సంగమేశ్వరాలయం కృష్ణాజలాల నుంచి బయటపడుతోంది. శ్రీశైలం డ్యామ్‌లో నీటి మట్టం తగ్గుతుండటంతో నంద్యాల జిల్లాలోని ప్రాచీన సంగమేశ్వరాలయ శిఖర భాగం ఆదివారం దర్శనమిచ్చింది.. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ఆదివారం 864.90 అడుగులకు చేరుకుంది.

దీంతో ఆలయ శిఖరభాగం కృష్ణాజలాలపై భక్తులకు కనువిందు చేస్తోంది. శిఖరానికి ఆలయ పురోహితుడు తెలకపల్లి రఘురామ శర్మ కుంకుమార్చన, పుష్పార్చన, మాలాంకరణ, మంగళహారతి వంటి విశేష పూజక్రతువులు నిర్వహించారు. అనంతరం కార్తీకమాసం సందర్భంగా సాయంసంధ్యా సమయంలో కృష్ణాజలాలలో మహామంగళహారతి నిర్వహించారు.  
–కొత్తపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement