వాగులో చిక్కుకున్న బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం | RTC Bus Stuck In Flood Water At Anantapur | Sakshi
Sakshi News home page

వాగులో చిక్కుకున్న బస్సు.. తృటిలో తప్పిన ప్రమాదం

Sep 5 2022 3:29 PM | Updated on Sep 5 2022 3:42 PM

RTC Bus Stuck In Flood Water At Anantapur - Sakshi

డోనెకల్‌లో ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది.

సాక్షి, డోనెకల్‌: అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, వాగులు, చెరువుల పొర్లిపొంగుతున్నాయి. కాగా, వర్షాల నేపథ్యంలో గుత్తి నుంచి బళ్లారి వెళ్లుండగా ఆర్టీసీ బస్సు.. డోనెకల్‌ వాగులో చిక్కుకుంది. బస్సు నీటిలో ఉన్న సమయంలో 30 మంది ప్రయాణికులు లోపల ఉన్నారు. అయితే, బస్సు వాగులో చిక్కుకోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై.. ట్రాక్టర్‌ సాయంతో బస్సును బయటకు తీశారు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement