తీరం దాటిన తీవ్ర అల్పపీడనం | Rains in the South Coast and Rayalaseema today | Sakshi
Sakshi News home page

తీరం దాటిన తీవ్ర అల్పపీడనం

Dec 13 2024 5:15 AM | Updated on Dec 13 2024 5:15 AM

Rains in the South Coast and Rayalaseema today

నేడూ దక్షిణ కోస్తా, రాయలసీమలో వానలు

సాక్షి, విశా­ఖప­ట్నం: గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ ప­రిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు దగ్గర అర్థ­రాత్రి తీరం దాటింది. తీరం దాటిన తర్వా­త శుక్రవారం ఉదయం నాటికి బలహీ­నపడ­నుందని వాతావరణ కేంద్రం అధికా­రులు తెలి­పారు. దీని ప్రభావంతో తమిళనాడులో వర్షాలు జోరందుకోనున్నాయి.

తీవ్ర అల్పపీడన ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం కూడా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో పొడి వాతావరణం ఉండనుంది.

Advertisement
 
Advertisement
Advertisement