నేడు, రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు | Rains In North Coast And Rayalaseema For Two Days | Sakshi
Sakshi News home page

నేడు, రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు

May 10 2024 10:13 AM | Updated on May 10 2024 11:04 AM

Rains In North Coast And Rayalaseema For Two Days

సాక్షి, విశాఖపట్నం: నేడు, రేపు ఉత్తర కోస్తా, రాయలసీమలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ మీదగా ద్రోణి కొనసాగుతోంది. ఈ రోజు,రేపు(శుక్ర,శని)వారాల్లో ఉత్తర కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది

ఈనెల 13వ తేదీన రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశముందని పేర్కొంది. ఏపీలో గత మూడు రోజుల్లో సగటున 10 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గడిచిన మూడు రోజుల్లో రాయలసీమతో పాటు రాష్ట్రంలో సగటున రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తక్కువగా నమోదైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement