ఏపీ: హెల్మెట్‌ లేని పోలీసులకు జరిమానా | Police Without Helmets Were Fined In Krishna District | Sakshi
Sakshi News home page

ఏపీ: హెల్మెట్‌ లేని పోలీసులకు జరిమానా

Jul 4 2021 7:27 PM | Updated on Jul 4 2021 9:33 PM

Police Without Helmets Were Fined In Krishna District - Sakshi

ప్రతికాత్మక చిత్రం

జిల్లా కేంద్రంలో 27 మంది పోలీసులకు ట్రాఫిక్‌ విభాగం అధికారులు శనివారం జరిమానాలు విధించారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బందరు ట్రాఫిక్‌ డీఎస్పీ భరత్‌మాతాజీ నగరంలో హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడిపే పోలీసులను పట్టుకునేందుకు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించారు.

కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): జిల్లా కేంద్రంలో 27 మంది పోలీసులకు ట్రాఫిక్‌ విభాగం అధికారులు శనివారం జరిమానాలు విధించారు. జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన బందరు ట్రాఫిక్‌ డీఎస్పీ భరత్‌మాతాజీ నగరంలో హెల్మెట్‌ ధరించకుండా వాహనాలు నడిపే పోలీసులను పట్టుకునేందుకు స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించారు. అన్ని ప్రధాన కూడళ్లతో పాటు పోలీసు క్వార్టర్స్‌ల వద్ద కాపు కాసి హెల్మెట్‌ లేకుండా రోడ్లపైకి వచ్చిన పోలీసులను పసిగట్టి మరీ పట్టుకున్నారు.

27 మంది హెల్మెట్‌ లేకుండా ప్రయాణించటాన్ని గమనించి అడ్డుకోవటంతో పాటు అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో జరిమానాలు విధించారు. మరో 100 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. ఒక్క రోజులో హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న 27 మంది పోలీసులకు జరిమానాలు విధించిన భరత్‌మాతాజీని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చట్టానికి ఎవ్వరూ అతీతులు కారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement