Police Case Registered Against Janasena Chief Pawan Kalyan Over Rash Driving - Sakshi
Sakshi News home page

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు

Nov 12 2022 2:49 PM | Updated on Nov 12 2022 4:40 PM

Police case Registered against Janasena chief Pawan Kalyan - Sakshi

సాక్షి, గుంటూరు: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదయ్యింది. తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రోజున పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 336, రెడ్‌విత్‌ 177ఎంవీ యాక్ట్‌ కింద కేసు నమోదయింది. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చోని వెళ్లడం, కార్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌పై ఫిర్యాదు అందడంతో పోలీసులు ఈ మేరకు స్పందించారు.

హైవేపై పవన్‌ కాన్వాయ్‌ని పలు వాహనాలు అనుసరించడంపై కూడా కేసు ఫైల్‌ చేశారు. తెనాలి మారిస్‌పేటకు చెందని శివ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పవన్‌ కల్యాణ్‌, కారు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 

చదవండి: (జనసేన నాయకుల ఓవరాక్షన్‌.. దెబ్బకు జారుకున్నారు)

Advertisement
 
Advertisement
Advertisement