
కాకినాడ: దళితులు గ్రామ బహిష్కరణకు గురైన ఘటన తాజాగా ఏపీలో వెలుగుచూసింది. పిఠాపురం రూరల్ గ్రామం పల్లంలో దళితులు గ్రామ బహిష్కరణకు గురయ్యారు. దళితులకు వస్తువులు విక్రయించవద్దనే ఊరి పెద్దల ఆదేశాలతో వారికి ఎటువంటి వస్తు విక్రయాలను చేయడం లేదు.. గ్రామ పెద్దల ఆదేశాలో నిన్నటి(శనివారం) నుండి దళితులకు వస్తు విక్రయాలు ఆపేశారు వ్యాపారులు.
ఇటీవల ఓ ఇంట్లో విద్యుత్ పని చేస్తుండగా పల్లపు సురేష్ అనే దళిత యువకుడు మృతిచెందాడు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని రెండు క్రితం దళితులు ఆందోళన తెలిపారు. దాంతో దళితులపై కక్ష గట్టారు. వారిపై బహిష్కరణ వేటు వేయాలని ఊరి పెద్దల సమక్షంలో నిర్ణయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
భారతదేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించే ఈ తరహా ఘటనలు ఇప్పుడు ఏపీలో కనిపించడం రాష్ట్రంలోని అరాచక పాలనకు అద్దం పడుతోంది. ఏపీలో పరిస్ధితులు ప్రస్తుత పాలకుల చేతుల్లో, చేతల్లో రోజు రోజూకి దిగజారిపోవడం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
