తాడేపల్లి: చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైరెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కరవు తాండవిస్తోందని తెలిపారు. లిక్కర్ కేసులో సిట్ 3 రూపాయలు కూడా పట్టుకోలేదని అన్నారు. లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు టీవీ సీరియల్‌లా సాగుతోందని చెప్పారు.
చంద్రబాబు కీలుబొమ్మ అయిన సిట్ ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదని అన్నారు. లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదని తెలిపారు. చంద్రబాబు చెప్పినట్లు సిట్ దర్యాప్తు జరుగుతోంది. లడ్డూ ప‍్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చెప్పిందని అన్నారు.
వైఫల్యాలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా..
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు వెలుగులోకి వచ్చినప్పుడల్లా లిక్కర్ కేసును బయటకు తీస్తారని పేర్ని నాని అన్నారు. రూ33 వేల కోట్ల అవినీతి అని చంద్రబాబు ఆరోపణలు చేశాని, శ్వేతపత్రంలో రూ.18 కోట్లు అన్నాని చెప్పారు. ఇప్పుడు రూ.3 వేల కోట్లు అంటూ సిట్ ఆరోపణలు చేస్తోంనితెలిపారు. ‘‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా సిట్ పరిస్థితి ఏర్పడింది. మధుబాబు డిటెక్టివ్ స్టోరీలాగా సిట్ విచారణ జరుగుతోంది. చివరకు సుప్రీంకోర్టు సైతం సిట్ ని కడిగిపారేసింది. ఇంకా ఎంతకాలం విచారణ చేస్తారని నిలదీశాం. అయినా నిస్సిగ్గుగా టీవీ సీరియల్ లాగా విచారణ చేస్తున్నారు. కేసులో 3వ ముద్దాయిగా ఉన్న సత్యప్రసాద్ ని ఎందుకు అరెస్టు చేయలేదు? పైగా దగ్గరుండి మరీ ముందస్తు బెయిల్ ఇప్పించారు.
సత్యప్రసాద్ ను చీడ పురుగు అన్న ఎల్లోమీడియా ఇప్పుడు ఆయన్ని సత్యహరిశ్చంద్రుడు అంటూ జాకీలు ఎత్తింది . కాకమ్మ కబుర్లు చెప్పుకుంటూ వార్తలు రాశారు . అసలు ఏనాడైనా సత్యప్రసాద్ జగన్ ని కలిశాడా? జగన్ పేరు ప్రస్తావించడం ద్వారా చంద్రబాబు ఏం చేయలేరు. తన ఎల్లోమీడియాలో బ్రేకింగ్ లు వేసుకోవటానికి తప్ప మరెందుకూ పనికిరాదు. సత్యప్రసాద్ కు పదేళ్లుగా మెంటల్ ఉందని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు . ఒక మానసిక రోగి ఇచ్చిన స్టేట్మెంట్లు పట్టుకుని జగన్ పేరు ప్రస్తావించడం సిగ్గుచేటు. డీఎస్సీలో రెగ్యులర్ పోస్టుల్లోనూ అక్రమాలు జరిగాయి.కోరుకొండ నగేష్, మామిడి నగేష్ అనే వ్యక్తులు 2018 లో Bc-D కోటాలో పరీక్ష రాసి, 2025లో ఓసీగా మార్చుకున్నారు.రాష్ట్రంలో ఎంతోమంది తహశీల్దారులు ఇష్టానుసారం సర్టిఫికేట్లు ఇచ్చారు.
దొంగ సర్టిఫికేట్లు ఇచ్చిన అధికారులంతా రేపు చిక్కుల్లో పడతారు. అడ్డగోలుగా సర్టిఫికేట్లు జారీ చేసిన వారంతా వాటిని సరిపోల్చుకోండి. చంద్రబాబు, లోకేష్ ల మెప్పు కోసం తప్పులు చేయవద్దు. కూటమి పాపాల గురించి ప్రజలు ఏం అనుకుంటున్నారో తెలుసుకోండి .లాకప్‌డెత్ చేసి హైకోర్టును కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. విజయవాడ మహానగరంలో పోలీసు శాఖకు ఏమైంది? సాయికృష్ణపై నాన్ బెయిలబుల్ వారెంట్ వుంటే సీపీ రాజశేఖర్ బాబు ఏం చేస్తున్నట్టు?’’ అని నిలదీశారు.
పోలీసులు దిగజారి పోయారు..
చంద్రబాబు పాలనలో కొందరు పోలీసులు దిగజారి పోయారని పేర్ని నాని చెప్పారు. ‘‘సాయికృష్ణ కేసును నీరు గార్చటానికే సిట్ రకరకాలుగా ప్రయత్నిస్తోంది. సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులాగే లిక్కర్ కేసును కూడా సీరియల్ గా నడిపిస్తున్నారు. సిట్‌లో ఉన్న వారంతా కల్పిత కథలతో సాగదీస్తున్నారు. ఇలాంటి అనైతిక నేర పరిశోధన వల్ల ఏం సాధిస్తారు?
జగన్ హయాంలో ఒక్క బ్రాండ్, ఒక్క డిస్టలరీలకు కూడా అనుమతి ఇవ్వలేదు. అన్నీ చంద్రబాబు హయాంలో ఇచ్చినవే. ఎక్సైజ్ మంత్రి ఇంటి చుట్టూ పది బెల్టు షాపులు ఉన్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలే మద్యం షాపులు నడుపుతున్నారు. సొంత కార్యకర్తల షాపులనే ఎమ్మెల్యేలు లాగేసుకున్నారు.
రాష్ట్రంలో క్యాషు, లోకేషు, సూట్ కేసు, రాజేషు, సాంబేషు అన్నట్టుగా పరిస్థితి మారింది. జగన్ హయాంలో కల్తీ మద్యం అంటూ చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి అవే బ్రాండ్లను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సంవత్సరం పాటు ఎందుకు విక్రయించారు? జత్మలాని కేసు నుండి తిరుమల లడ్డూ వరకు చంద్రబాబు చేసినవన్నీ తప్పుడు ప్రచారాలు చేశారు. బందరు పోర్టును త్వరలోనే అమ్మేయబోతున్నారు. మరో మూడు వేల ఎకరాలను భూసేకరణ చేయబోతున్నారు. ఒక గ్రామాన్ని కూడా ఖాళీ చేయించబోతున్నారు’’ అని తెలిపారు.


