సెలూన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ | Pawan Kalyan Opens Salon Koniki In Kannur | Sakshi
Sakshi News home page

సెలూన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Jun 8 2025 3:11 PM | Updated on Jun 8 2025 4:19 PM

Pawan Kalyan Opens Salon Koniki In Kannur

సాక్షి,విజయవాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సెలూన్‌ను ఘనంగా ప్రారంభించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరు రోడ్డు అయ్యప్ప నగర్‌ సమీపంలో ఆదివారం ‘సెలూన్‌ కొనికి’ని ప్రారంభించారు. అయితే సెలూన్‌ ప్రారంభోత్సవానికి పవన్‌ టీషర్టు, షార్ట్‌ వేసుకొని వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.  

 

మరోవైపు, రాష్ట్రంలో కొనసాగుతున్న రెడ్‌ బుక్‌ రాజ్యాంగం, అక్రమ కేసులు, ఆమడ దూరంలో అభివృద్ధితో రాష్ట్రం నుంచి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలివెళ్లే అంశంపై పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమలు రాక, వెంటాడుతున్న నిరుద్యోగాన్ని ప్రస్తావిస్తూ ఇదేనా రాష్ట్ర అభివృద్ధి అంటూ పవన్‌ తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement