28న పాక్షిక చంద్రగ్రహణం 

Partial lunar eclipse on 28th - Sakshi

అదే రోజు సాయంత్రం నుంచి ఇంద్రకీలాద్రి, శ్రీశైలం ఆలయాల మూసివేత 

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం టెంపుల్‌:  ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6:30 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసి­వేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది.

సాయంత్రం అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం కవాట బంధనం (తలుపులు మూసివేయడం) చేయనున్నట్లు పేర్కొంది. 29న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేపట్టి 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 29న సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చనను రద్దు చేశారు. శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణాలు యథావిధిగా జరగనున్నాయి.  

28న శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత 
చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలాలయ ద్వారాలు 28న సాయంత్రం 5 గంటల నుంచి 29న ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నా­రు. 29న ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభిస్తారు. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకే సర్వదర్శనం, మధ్యాహ్నం 12.30 గంటల వరకే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. సర్వదర్శనానికి ఉదయం మాత్రమే అవకాశం ఉంటుంది. 28న అన్నప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని..ఆ రోజు సాయంత్రం అల్పాహార వితరణ నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top