నెలాఖరుకు ఈశాన్య రుతు పవనాలు

ఈశాన్య రుతుపవనాలు ఈ ఏడాది ఆలస్యంగా ప్రవేశించనున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతు పవనాలు అక్టోబర్ 15కల్లా ప్రవేశిస్తాయి. అయితే, నైరుతి రుతు పవనాల ఉపసంహరణలో జాప్యం.. త్వరలో బంగాళాఖాతంలో తుపాను, అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుండటం వంటి పరిస్థితులు ఈశాన్య రుతు పవనాల రాక ఆలస్యం కావడానికి కారణమవుతున్నాయి. దీని వల్ల ఈశాన్య రుతుపవనాలు ఈ నెల 28-31 తేదీల మధ్య ప్రవేశించే వీలుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.