
తణుకు అర్బన్: వివాహ బంధాన్ని భార్య వద్దంటోంది. కన్నతండ్రితో అనుబంధాన్ని కుమారుడు తెంచు కుంటున్నాడు. ఏడేళ్ల క్రితం తెగిపోయిన రక్తసంబం ధం నేడు ఎదురైనా తమకు వద్దంటే వద్దని ఆ కుటుంబం తెగేసి చెబుతోంది. దీంతో ప్రమాదవ శాత్తు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు అల్లాడుతున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశ రావుపాలెంకు చెందిన కలగర సుబ్బారావు ఏడేళ్ల కిత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.
ఆది వారం కాల్దరి స్టేషన్లో రైలు నుంచి జారిపడగా రైల్వే పోలీసులు తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. వృద్ధుడిని ఆరా తీయగా కుటుంబసభ్యుల వివరాలు తెలిపారు. రైల్వే కానిస్టేబుల్ బాల విషయాన్ని వృద్ధుడి కుమారుడు సుధీన్ రాజుకు ఫోన్ ద్వారా తెలియజేయగా తనకు నాన్న అవసరం లేదని తెగేసి చెప్పాడు.
అయినా కానిస్టేబుల్ బాల ప్రకాశరావుపాలెంలోని ఇంటికి వెళ్లి వృద్ధుడి భార్యతో విషయం చెప్పగా తన భర్త ఎప్పుడో చనిపోయాడని. అతడి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని వితంతు పింఛను కూడా పొందుతున్నట్టు సమాధానం ఇవ్వ డంతో రైల్వే పోలీసులు ఆశ్చరుపోయారు.
కేసు నమోదు చేసినా ఇబ్బందిలేదు
సుధీన్ రాజును ఎట్టకేలకు రైల్వే పోలీసులు తణుకు ఆస్పత్రికి తీసుకురాగా సోమవారం ఆర్ఎంఓ డాక్టర్. ఏవీఆర్ఎస్ తాతారావు కౌన్సెలింగ్ ఇచ్చారు. తమకు సుబ్బారావు అవసరం లేదని, అవసరమైతే అలా రాసిస్తామని సుధీన్ రాజు సమాధానమిచ్చాడు. దీంతో సీఐ ఎన్.కొండయ్య ఆస్పత్రి వద్దకు వచ్చి కన్న తం డ్రిపై నిర్లక్ష్యం వహిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించగా.. కేసు నమోదు చేసుకోమని సుధీన్ రాజు తెగేసి చెప్పాడు. దీంతో చేసేదిలేక ఆస్పత్రి లో నే వైద్యులు సుబ్బారావుకు చికిత్స అందిస్తున్నారు.